»   » నాకేమీ కాలేదు: టెన్షన్ వద్దంటూ ప్రభాస్ మెసేజ్

నాకేమీ కాలేదు: టెన్షన్ వద్దంటూ ప్రభాస్ మెసేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కేరళలో జరుగుతున్న 'బాహుబలి' చిత్రం షూటింగులో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. షూటింగులో ప్రభాస్ గాయపడ్డట్లు ఇటీవల సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఆ వార్తల్లో నిజంలేదంటున్నారు ప్రభాస్.

తాను క్షేమంగానే ఉన్నాను అంటూ.. తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో అభిమానులకు సందేశం పంపారు. 'కేరళలో జరుగుతున్న బాహుబలి షూటింగులో నేను గాయపడ్డట్లు వార్తలు విన్నాను. అలాంటి దేమీ లేదు. నేను చాలా బాగున్నాను. షూటింగులో పాల్గొంటున్నాను' అంటూ ప్రభాస్ తెలిపారు.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం బాహుబలి సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. డిసెంబర్ 3న కేరళ షెడ్యూల్ పూర్తి కానుంది.

దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు. ఈ మేరకు వారికి కత్తియుద్ధం, గుర్రపుస్వారీలో శిక్షణ ఇచ్చారు. పీటర్ హెయిన్స్ ఈ యుద్ద సన్నివేశాలకు యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్లో ప్రారంభం అయ్యే ఈ షూటింగ్ రెండు నెలల పాటు ఫిబ్రవరి నెల వరకు సాగుతుందని తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

English summary
"Rumours of me having an accident while shooting for Baahubali in Kerala are not true. I am perfectly fine and shooting is going on smoothly in Kerala. Thanks to all my fans and well wishers for the love and concern." Prabhas said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu