»   » నా అజాగ్రత్తవల్లే.., అందరికీ సారీ..! ఆక్సిడెంట్ వీడియో చూపిస్తాను: మంచు విష్ణు

నా అజాగ్రత్తవల్లే.., అందరికీ సారీ..! ఆక్సిడెంట్ వీడియో చూపిస్తాను: మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం తరువాత మూడోసారి విష్ణు.. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'ఆచార అమెరికా యాత్ర' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల రెండో షెడ్యూల్ పూర్తిచేసి.. మూడో షెడ్యూల్ కోసం మలేషియా వెళ్లారు చిత్ర యూనిట్.అయితే ఓ సీన్‌లో విష్ణు బైక్ పై వెళుతుండగా ప్రమాదవశాత్తూ బైక్ స్కిడ్ అయి కిందపడటంతో గాయాలయ్యాయి. అయితే విష్ణుకు పెద్ద ప్రమాదం ఏం లేదని త్వరలోనే ఆయన కోలుకుంటాడని డాక్టర్స్ చెప్పారు. నెమ్మదిగా కోలుకుంటున్న మంచు విష్ణు తన గురించి ఆందోళన పడవద్దంతూ ట్వీట్ చేసాడు.

ఆచారి అమెరికా యాత్ర' సినిమా షూటింగ్ సందర్భంగా బైక్ పై నుంచి పడి గాయాలపాలైన మంచు విష్ణు, ప్రస్తుతం తాను కోలుకున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఎంతో మంది తాను ప్రమాదానికి లోనైన తరువాత తనకు ఫోన్లు చేశారని, తాను తీసుకోని ఓ చిన్న జాగ్రత్త కారణంగా తమ తల్లిదండ్రులకు, పిన్నికి, అక్కకు, తమ్ముడికి, అభిమానులకు బాధ కలిగించానని అన్నాడు. వారందరికీ సారీ చెప్పాల్సి వుందని చెప్పాడు. తన స్నేహితులు, శ్రేయోభిలాషులను కూడా క్షమాపణ కోరుతున్నానని, ఆ రోజు అసలేం జరిగిందన్న విషయమై తమ వద్ద ఉన్న వీడియో ఫుటేజ్ ని రెండు రోజుల్లో విడుదల చేస్తానని అన్నాడు. నేడు ఇలా అందరి ముందు మాట్లాడుతున్నానంటే, అది దేవుడిచ్చిన వరమేనని అభివర్ణించాడు మంచు విష్ణు.

English summary
"I am safe and Healthy, Recovering Now... will Come back better...Thanking You all" Tweeted Manchu Vishnu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu