»   »  కంగనా ఈమెయిల్ సంచలనం: ఆ హీరోతో ఫిజికల్ రిలేషన్ గురించి...

కంగనా ఈమెయిల్ సంచలనం: ఆ హీరోతో ఫిజికల్ రిలేషన్ గురించి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, హీరో హృతిక్ రోషన్ మధ్య చోటు చేసుకున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య జరిగిన ఈమెయిల్స్ వ్యవహారం 2014లో వెలుగు చూడగా, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, కేసులు పెట్టుకోవడంతో తారా స్థాయికి చేరింది. అయితే ఈ వివాదం ఇంకా ముగియలేదు. తాజాగా ఈ వ్యవహారం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

తను నాకు లైంగికంగా రెచ్చగొట్టే మెయిల్స్‌ పంపింది : హృతిక్‌రోషన్‌

ఓ న్యూస్ ఛానల్ ఈ విషయాన్ని మళ్లీ కదిలించింది. హృతిక్ రోషన్‌కు కంగనా పంపిన కొన్ని ఈమెయిల్స్ తాజాగా బయట పెట్టింది. ఈ ఈమెయిల్స్ హృతిక్ లీక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. తాజాగా ఈ లీకైన ఈమెయిల్స్‌లో రణబీర్ కపూర్ ప్రస్తావన ఉండటం చర్చనీయాంశం అయింది.

తెరపైకి వారి పేర్లు

తెరపైకి వారి పేర్లు

హృతిక్ లీక్ చేసినట్లు భావిస్తున్న కంగనా ఈమెయిల్స్ లో ఆర్‌కె(రణబీర్ కపూర్), క్యాట్(కత్రినా కైఫ్), ఆమె సిస్టర్ రంగు(రంగోలి చందల్) పేర్లు ఉండటం చర్చనీయాంశం అయింది.

క్వీన్ తర్వాత

క్వీన్ తర్వాత

క్వీన్ సినిమా ముందు వరకు రణబీర్ తనపై పెద్దగా ఆసక్తి చూపలేదని, ఆ సినిమా చూసిన తర్వాత తన పట్ల ఆసక్తి చూపాడని కంగనా పేర్కొన్నట్లు... లీకైన ఈమెయిల్స్ లో ఉంది.

ఓసారి షూటింగులో ఉండగా...

ఓసారి షూటింగులో ఉండగా...

ఒకసారి తాను రివాల్వర్ షూటింగులో భాగంగా గ్వాలియర్ లో ఉండగా....తనను స్ట్రైట్ గా అప్రోచ్ అయ్యాడని, అయితే అపుడు తాను వేరొకరితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తేల్చి చెప్పానని... కంగనా పేర్కొన్నట్లు లీకైన ఈమెయిల్స్ ఉంది.

ఫిజికల్ రిలేషన్ షిప్ గురించి

ఫిజికల్ రిలేషన్ షిప్ గురించి

ఒకసారి న్యూయార్కులో ఉన్నపుడు రణబీర్ తనకు న్యూయార్క్ ఎలా ఉందని టెక్ట్స్ చేశాడు. నాతో ఫిజికల్ రిలేషన్ షిప్ పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నావా? అని అడిగాను, అతడు వెంటనే బెదిరిపోయాడు. నేను వెంటనే మనం రెగ్యులర్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేద్దామని చెప్పాను, అప్పటికే నేను వేరొకరితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు చెప్పా. అపుడు అతడు కాస్త బ్యాడ్ ఫీలయ్యాడనిపించింది.... అని కంగనా పేర్కొన్నట్లు లీకైన ఈమెయిల్స్ లో ఉంది.

ముదురుతున్న వివాదం

ముదురుతున్న వివాదం

సమసిపోయింది అనుకున్న కంగనా-హృతిక్ వివాదం తాజాగా మళ్లీ తెరపైకి రావడం, మీడియాలో దీని గురించి మళ్లీ హాట్ టాపిక్ కావడంతో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. తన పేరు ప్రస్తావనకు రావడంపై రణబీర్ ఎలా స్పందిస్తాడో?

English summary
Kangana Ranaut and Hrithik Roshan's legal tussle has shown fresh developments over the past few days. And a fresh name in this controversy is Ranbir Kapoor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu