»   » వెక్కి వెక్కి ఏడ్చాను: ప్రియుడితో బ్రేకప్‌పై దీపిక పదుకోన్

వెక్కి వెక్కి ఏడ్చాను: ప్రియుడితో బ్రేకప్‌పై దీపిక పదుకోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సెలబ్రిటీలకు ఎమోషన్స్ ఉండవని ఎవరన్నారు? ప్రియుడు రణబీర్ కపూర్‌తో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్ బ్రేకప్ అయిన ఘటన వెనక చాలా ఎమోషన్ దాగి ఉంది. అతనితో బ్రేక్ అయిన తర్వాత తాను వెక్కి వెక్కి చాలా కాలం ఏడ్చానని దీపిక పదుకోన్ ఇటీవల చెప్పుకొచ్చింది.

ఇండియా టుడే నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన దీపిక పదుకోన్...ఇంతకాలం తన మనసులో దాచుకున్న విషయాలను బయటకు వెల్లగక్కింది. మాజీ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్‌తో మళ్లీ కలిసే ఉద్దేశ్యం ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు దీపిక పదుకోన్ సమాధానం ఇస్తూ....'ఆ విషయం గురించి తాను ఇప్పటి వరకు ఆలోచించలేదని. ప్రస్తుతం ఎవరి దారిలో వారున్నాం. బ్రేకప్ అయినప్పుడు చాలా ఏడ్చాను. ఆ తర్వాత రియలైజ్ అయ్యాను' అని తెలిపింది.

Deepika Padukone

ఇటీవల 'రామ్-లీలా' చిత్రంలో దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌంట్ అయింది. ఈ సినిమా విడుదల అనంతరం ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని, అందు వల్లే అలా రెచ్చిపోయి రొమాంటిక్ సీన్లలో నటించారనే ప్రచారం మొదలైంది. దీనిపై దీపిక పదుకోన్ స్పందిస్తూ....ఇలాంటి వార్తలపై స్పందించడానిక తాను సిద్ధంగా లేనని వెల్లడించింది. ప్రస్తుతం దీపిక పదుకొనె మాజీ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ మరో హీరోయిన్ కత్రినా కైఫ్‌‌తో ప్రేమలో మునిగి తేలుతున్నాడు.

దీపిక పదుకోన్ సినిమాల విశేషాల్లోకి వెళితే....ఆమె రజనీకాంత్‌కు జోడీగా నటించిన తమిళ చిత్రం 'కొచ్చాడయాన్' ఏప్రిల్ 11న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు ఆమె 'ఫైండింగ్ ఫన్నీ ఫెర్నాండెజ్', హ్యాపీ న్యూఇయర్ అనే హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో ఒకటి పోస్టు ప్రొడక్షన్ దశలో ఉండగా, మరొకటి చిత్రీకరణ దశలో ఉంది.

English summary
Who says celebrities don't have emotions! Following her recent break up with actor Ranbir Kapoor, beautiful Deepika Padukone confessed that she cried a lot after the separation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu