»   » ‘బాహుబలి లాంటి సినిమాల్లో ఛాన్స్ వచ్చినా చేయను’

‘బాహుబలి లాంటి సినిమాల్లో ఛాన్స్ వచ్చినా చేయను’

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండియా మొత్తం 'బాహుబలి' చిత్రాన్ని గొప్ప చిత్రంగా కీర్తిస్తూ భారీ హిట్ చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది ఇండియన్ స్టార్స్ ఈ సినిమాలో తమకు అవకావం దక్కి ఉంటే బావుండు అని కోరుకున్నవారు ఎందరో. ఇలాంటి తరుణంలో 'బాహుబలి' సినిమాపై ఓ బాలీవుడ్ నటి చేసిన నెగెటివ్ కామెంట్స్ హాట్ టాపిక్ అయింది.

ఆ నటి పేరు సయాని గుప్తా. 'బాహుబలి 2' ట్రైలర్ చూశాక, ఈ సినిమా చూడాలని తనకు అనిపించలేదని, ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం తనకు వచ్చినా కూడా నటించనని చెప్పింది. బాహుబలి సినిమా స్థాయి హాలీవుడ్ చిత్రాలతో పోల్చదగినది కాదని, అదో భారీ చిత్రం మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు.

I didn’t feel like watching Baahubali after seeing the trailer: Sayani Gupta

'బజరంగీభాయ్ జాన్' లాంటి సినిమాల్లో నటించాలని తనకు ఉందని, ఆ చిత్రం చాలా బాగుంటుందని సయానీ గుప్తా అన్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి ఫాంటసీ సిరీస్ షోలు ఇష్టమని, ఇలాంటి వాటిలో ఎమిలియా క్లేర్క్ చేసిన పాత్రలు చేయడం అంటే ఇష్టమని తెలిపారు.

ప్రస్తుతం సయానీ గుప్తా బాలీవుడ్ మూవీ 'హంగ్రీ' చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన సయానీ నటిస్తోంది. ఇంతకు ముందు జాలీ ఎల్ఎల్‌బి 2 చిత్రంలో నటించింది. అయితే ఈ భామ 'బాహుబలి' సినిమాను తిట్టిపోవడయం వెనక పబ్లిసిటీ స్టంట్ ఉందనే విమర్శలు వస్తున్నాయి. మీడియా ఫోకస్ తనపై పడేందుకే బాహుబలి లాంటి సినిమాలను విమర్శిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
"I didn’t feel like watching Baahubali after seeing the trailer" Sayani Gupta said. Jolly LLB 2 actor Sayani Gupta wants to be part of commercial potboilers, but will not star in them unless she is excited by the story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu