»   » తేల్చేసాడు :పూరి 'ఆటోజానీ' సెకండాఫ్ నాకు నచ్చలేదు

తేల్చేసాడు :పూరి 'ఆటోజానీ' సెకండాఫ్ నాకు నచ్చలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :"నాకు పూరి జగన్నాథ్ నేరేట్ చేసిన కథ సెకండాఫ్ నచ్చలేదు ," అంటూ చిరంజీవి తన 150 వ చిత్రం గురించి చాలా కాలం తర్వాత నోరు విప్పారు. ఆయన తెలుగులో ఓ లీడింగ్ టీవి ఛానెల్ తో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఓ మూడు నెలల లోపు స్క్రిప్టుని ఫైనలైజ్ చేసి పట్టాలు ఎక్కిస్తామనే ధీమాగా ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి, పూరి కాంబినేషన్ లో ఆటో జాని చిత్రం వస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి ఇలా చెప్పి దానికి అడ్డుకట్ట వేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


చిరంజీవి అభిమానులు అంతా ఆగస్టు 22న ఈ చిత్రం ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఇలా బాంబు పేల్చారు. ఇప్పటికే స్క్రిప్టు ఫైనలైజ్ కాకపోతే ప్రకటన రావటం కష్టమే. వివి వినాయిక్ తోనే చిరంజీవి ముందుకు వెళ్తాడని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిమిత్తం ఇండస్ట్రీలోని టాప్ రైటర్స్ చేత కథలు సిద్దం చేస్తున్నట్లు వార్త. వాటిలో ఒకటి ఫైనలైజ్ చేస్తారని అంటున్నారు.


I didn't like Auto Jhonny 2nd Half - Chiranjeevi

అందుతున్న సమాచారాన్ని బట్టి చిరంజీవి తన 150వ మెసేజ్ ఓరియెంటెడ్ లాగ కాకుండా ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చూడాలనకుంటున్నారని, అది లాండ్ మార్క్ గా నిలిచిపోయేలే చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి అంచనాల మేరకు ఏ స్క్రిప్టు ఓకే కాకపోవటంతో ప్రాజెక్టు డిలే అవుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తారు...చిరంజీవి గారి సతీమణి సురేఖ సమర్పిస్తారు.


మరో ప్రక్క చిరంజీవి ఈలోగా రామ్ చరణ్ తాజా చిత్రం మెరుపులో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఆగస్టు 22 న గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరగటానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.

English summary
Chiranjeevi has opened mouth about his 150th film. In an interview to a leading TV channel, Chiranjeevi affirmed to finalize the movie mostly in 2 to 3 months time. "I didn't like 2nd half of the story narrated by Puri Jagannath," added Chiranjeevi.
Please Wait while comments are loading...