For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అంతపెద్ద హిట్టు.. అయినా నో రెమ్యునరేషన్., సప్తగిరి ఎందుకలా...

  |

  మిక్స్ డ్ సమీక్షలతో జనం ముందుకు వచ్చిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ ను బి సి సెంటర్ల జనం బాగానే ఆదరిస్తున్నారు. పైగా వంగవీటి థియేటర్లు కొన్ని ఖాళీ కావడం సప్తగిరి ఎక్స్ ప్రెస్ కు పనికి వచ్చింది. మండే నుంచి మరో యాభై థియేటర్లు పెంచుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత రవికిరణ్ కూడా ప్రకటించారు. హీరోగా సప్తగిరి మొదటి సినిమా ఏకంగా రెండున్నర కోట్లకి దగ్గర దగ్గర కలక్ట్ చెయ్యడమే షాకింగ్ గా ఉంది.

  మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 2.35 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది అని స్వయంగా ఈ సినిమా నిర్మాత రవికిరణ్ ప్రకటించాడు. ఇది నిజమేనా అంటున్నారు అందరూ. టాలీవుడ్ క‌మెడియ‌న్స్ హీరోలుగా మారి రాణిస్తున్న త‌రుణంలో ఇప్ప‌టి యంగ్ జ‌నరేష‌న్ క‌మెడియ‌న్స్‌లో ఒక‌రైన స‌ప్త‌గిరి హీరోగా మారి చేసిన చిత్రం స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌. నేను కమెడియ‌న్‌గా ఒకే విధ‌మైన క్యారెక్ట‌ర్స్ చేస్తుండ‌టంతో బోర్ కొట్టి హీరోగా మారాన‌ని స‌ప్త‌గిరి చెప్పాడు. సాంగ్స్ ప్రోమోస్‌, టీజ‌ర్ చూస్తే స‌ప్త‌గిరి ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌న‌ప‌డింది. నిజమైతే మాత్రం సప్తగిరి సునీల్ కంటే పెద్ద హీరో అయ్యే ఛాన్స్ ఉంది మరి.

  'వంగవీటి'తో పాటు నాలుగు సినిమాలతో పోటీ పడి రిలీజైంది 'సప్తగిరి ఎక్స్ప్రెస్'. అయినప్పటికీ ఈ చిత్రానికి 300 దాకా థియేటర్లు దక్కడం విశేషమే. పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు అతిథిగా రావడం.. ట్రైలర్ అదీ చూస్తే మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్ లాగా కనిపించడంతో 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' థియేటర్లు తొలి రోజు జనాలతో కిటకిటలాడాయి. చాలా చోట్ల హౌస్ ఫుల్స్ కూడా పడ్డట్లు సమాచారం. సప్తగిరి సొంత జిల్లా చిత్తూరులో అయితే కొన్ని చోట్ల బ్లాక్ లో టికెట్లు అమ్మే పరిస్థితి వచ్చింది.

  I Didn't took single rupee for Saptagiri Express said Saptagiri

  అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది తమిళ సినిమా ని తెలుచేసేటప్పుడు సప్తగిరి కేవలం నటన మాత్రమే కాదు తెలుగు నేటివిటీకి తగ్గట్టు అందులో మార్పులు కూడా అతడే చేశాడట. అందుకే అడిషనల్ స్క్రీన్‌ప్లే క్రెడిట్‌ను కూడా తీసుకున్నాడు. అయితే.. ఈ సినిమాకు అతడు ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదట.

  తాను హీరోగా సినిమా తీయడానికి నిర్మాత రవికిరణ్ ముందుకు రావడమే ఓ గొప్ప విషయమని, అందుకే తనకు ఇచ్చే పారితోషికాన్ని సినిమా నిర్మాణానికి ఉపయోగించుకుంటాడన్న ఉద్దేశంతో ఒక్క రూపాయి కూడా ఆయన నుంచి తీసుకోలేదని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో అతడు వెల్లడించాడు. సినిమా విడుదలయ్యాక ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. డివైడ్ టాక్ ఉన్నా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో వస్తున్నాయి. ఇక, ఈ సినిమాతో సప్తగిరి ఉన్నంతలో మెరుగైన ఫలితాన్నే అందుకున్నాడు.

  English summary
  Saptagiri revealed out that he has got no charge for this movie at all. Saptagiri Express and instead asked the film's producer Ravi to invest that money in the making of the movie. Saptagiri himself declared the same.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X