twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్, అఖిల్ వెలుతున్నారు... ఇలియానా ఇలా అనేసిందేంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి శల్లి కుమార్ అనే వ్యక్తి ఛారిటీ కాన్సెర్ట్ ను ఏర్పాటుచేసారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో సినీతారలు పాల్గొని పర్ఫార్మెన్స్ లు చేయనున్నారు.

    ఈ ఈవెంట్ లో అఖిల్, రామ్ చరణ్ , శ్రియసరన్, ప్రభుదేవా, మలైకా అరోరా, సోఫీ చౌదరిలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోనాల్డ్ ట్రంప్ హాజరుకాకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి తాను వెళ్లబోనని, అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతివ్వనని ప్రముఖ సినీ నటి ఇలియానా డిక్రూజ్ తేల్చి చెప్పింది.

     నో చెప్పిన ఇలియానా

    నో చెప్పిన ఇలియానా

    ఈ కార్యక్రమంలో ఇందులో పాల్గొనేందుకు సౌత్ నుండి రామ్ చరణ్, అఖిల్, శ్రీయ, ప్రభుదేవా లాంటి స్టార్స్ బాలీవుడ్ నుండి మలైకా అరోరా, సోపీచౌదరి లాంటి వారు అంగీకరించారు. అయితే ఇలియానా మాత్రం నో చెప్పింది.

     ట్రంప్ కారణంగానే

    ట్రంప్ కారణంగానే

    ఈ చారిటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రంప్ పాల్గొంటున్న కారణంగానే ఇలియానా పాల్గొనేందుకు గీకరించలేదు. ఈ కార్యక్రమంలో పాల్గొంటే ట్రంప్ కి సపోర్ట్ చేయడమే అని ఇలియానా భావన.

     ఇలియానా తీరుపై విమర్శలు

    ఇలియానా తీరుపై విమర్శలు

    అయితే ఇలియానా తీరును కొంత మంది తప్పుబడుతున్నారు. ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు అందులో రకరకాల వ్యక్తులు పాల్గొంటారు. వారిలో చెడ్డ వారు ఉండొచ్చు, మంచి వారు ఉండొచ్చు. అంతే కానీ ట్రంప్ వస్తున్నాడని ఆమె కార్యక్రమానికి దూరం కావడం అర్థం లేని విషయమే అంటున్నారు.

    శ్రీయ

    శ్రీయ

    ఈ చారిటీ కార్యక్రమానికి సంబంధించి ఇటీవల హైద్రాబాద్ లో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో హీరోయిన్ శ్రియ పాల్గొన్నారు. ఇలాంటి ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొడం చాలా సంతోషంగా ఉందని శ్రియ తెలిపారు. ఉగ్రవాద దాడుల్లో నష్టపోయిన వారికోసం పెర్ఫార్మ్ చేయడం మా బాధ్యత అనుకొనే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. పలు సినిమా పాటలకు పెర్ఫార్మ్ చేయనున్నట్లు శ్రీయ తెలిపారు.

    English summary
    Actress Ileana D'Cruz today said it is nice that Bollywoodand South Indian filmstars have been invited to perform at a mega concert in the US to boost the electoral fortunes of Republican presidential nominee Donald Trump but maintained she would not support his candidature. "Bollywood is known worldwide and the stars are very popular and hence it is nice (that the Bollywood stars also are performing at the event)," she told PTI after the launch of La Senza store here. "But if you are asking me if I support Donald Trump? I don't," she added.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X