»   » రికార్డ్లులు ముఖ్యం కాదు..ప్రయోగాలు చేయాలి

రికార్డ్లులు ముఖ్యం కాదు..ప్రయోగాలు చేయాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమర్షియల్ సక్సెస్ లు ఎప్పుడైనా వస్తాయి. రికార్డులు ముఖ్యం కాదు, కొత్తదనంతో కూడుకున్న కొత్తదనాన్ని ఎంచుకుంటూ నిరంతరం ప్రయోగాలతో సాగిపోవాలన్నదే నా అభిలాష. మనం చేసిన పాత్రలు మరెవ్వరైనా చేయాలంటే ఆలోచించుకునేలా వుండాలి. తెలుగులో నిర్మించే ప్రయోగాత్మక చిత్రాలు వాణిజ్యపరంగా విజయం సాధిస్తే మన పరిశ్రమ ఖ్యాతి అంతర్జాతీయ స్గాయికి చేరుకోగలదు అని అంటున్నారు మంచు మనోజ్ కుమార్. తాజా చిత్రం 'బిందాస్" విజయంతో నూతనోత్సాహంతో వున్న మనోజ్ విజయానందాన్ని 'తెరపంచుకుంటూ" బిందాస్ నా కెరీర్ లో పెద్ద కమర్షియల్ సక్సెస్ ను సాధిస్తోంది.

సినిమా లో వున్న వినోదం, దర్శకుడు వీరు పోట్ల సంభాషణలు, ఎలాంటి డూప్ లేకుండా చేసిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. పోరాట దశ్యాల చిత్రీకరణ సమయంలో ఎంతో రిస్క్ తీసుకొని కొన్ని సన్నివేశాలు చేశాం. 'బిందాస్ ద్వారా నాన్నకు మంచి కమర్షియల్ విజయాన్ని బహుమతిగా అందించాలన్న కోరిక తీరింది. నా కెరీర్ ప్రారంబం నుండి రొటీన్ చిత్రాలకుభిన్నంగా ప్రయోగాలు చేయడం ఇష్టం. ఆ కోవలో 'నేను మీకు తెలుసా", 'ప్రయాణం" చిత్రాలు నాకెంతో సంతృప్తినిచ్చాయి. కమర్షి యల్‌ కథాంశాల్ని ఎంచుకున్నా సహజత్వానికి దగ్గరగా వుండేలా చూసుకుంటాను.

ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో 'వేదం", 'రాఘవేంద్ర రావు" దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాను. రాఘవేంద్రరావు చిత్రం సంగీతం ప్రధానంగా వుంటుంది.అందులో నేను బాలసుబ్రహ్మణ్యం అభిమానిలా కనిపిస్తాను. రాఘ వేంద్రరావు దర్శకత్వంలో పనిచే యడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన రాజా దర్శకత్వంలో 'ఊకొడతారా..ఉలిక్కిపడతారా" అనే పేరుతో సంపూర్ణ హాస్య రసభరిత చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఆ చిత్రం వుంటుంది అని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu