»   »  తమన్నా, హన్సిక, కలర్స్ స్వాతి లాస్ట్ నైట్ ఎక్కడ?

తమన్నా, హన్సిక, కలర్స్ స్వాతి లాస్ట్ నైట్ ఎక్కడ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : 2013 కి ముగింపు పలుకుతూ క్రితం రాత్రి అంతా న్యూ ఇయిర్ సంబరాలు జరుపుకున్నారు. మన అందాల భామలంతా కొత్త ఏడాది వేడుకల సంబరాలకు విదేశాలను ఎంచుకుంటే.. మిల్కీ వైట్‌ బ్యూటీ తమన్నా, 'కలర్స్‌' స్వాతిలు మాత్రం తమ ఇంటివద్దే జరుపుకున్నారట, ఎక్కడికో వెళ్లటం కంటే ఎంచక్కా ఇంటిలోనే ఉండటం ఇష్టమని చెబుతున్న వీరు బందుమిత్రులను ఇంటికే పిలిచి సంబరాల్లో పాల్గొన్నారట.

ప్రియా ఆనంద్‌ కొత్త ఏడాది వేడుకలు ఈ సారి 'థాయ్‌లాండ్‌'లో జరుపుకుంది. తన కొత్త చిత్ర సినిమా షూటింగ్‌ కోసం అక్కడే మకాం వేసిన ఈ అందాల భామ పనిలో పనిగా.. ఈ వేడుకలనూ అక్కడే జరుపుకుంది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 'సహజంగా నేను పార్టీలకు దూరంగా ఉంటాను. అయితే ఈ ఏడాది మాత్రం న్యూఇయర్‌ వేడుకలను కోలాహలంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యాను. ఇప్పటికే మా కుటుంబీకులను కూడా ఇక్కడకు రప్పించుకున్నాను. వారితో కలిసి ఆనందంగా గడుపుతున్నానని తెలిపింది.

ప్రియమణి బాటలోనే తన స్నేహితురాళ్లతో కలిసి కొత్త సంబరాల్లో మునిగితేలింది 'హన్సిక'. ఆమె వేడుకలకు 'అమెరికా' వేదికగా నిలవనుంది. ఇప్పటికే అక్కడకు చేరుకున్న ఆమె న్యూయార్క్‌లో వేడుక జరుపుకొందట. దీంతో పాటు అక్కడ స్థానికులు ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుందట.

విదేశాల్లో కొత్త ఏడాది వేడుకలను జరుపుకోవాలని గత కొన్ని రోజులుగా ఆసక్తిగా ఉన్న వారిలో అమలాపాల్‌ ముందున్నారు. దీనికోసం ఆమె ఎంచుకున్న ప్రాంతం 'రోమ్‌'. ముందే తన కుటుంబంతో పాటు అక్కడకు చెక్కేసిన అమలాపాల్‌ ముందుగా వాటికన్‌ సిటీలో జరిగిన నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంది. అనంతరం కుటుంబీకులతో కలిసి కొత్త ఏడాది సంబరాలను అంబరాన్ని అంటేలా జరుపుకొందట మళయాల ముద్దుగుమ్మ.

ప్రియమణి సైతం కొత్త సంవత్సరాన్ని థాయ్‌లాండ్‌లోనే జరుపుకుంది. కాకపోతే ఆమెవెంట కుటుంబీకుల స్థానంలో స్నేహితులున్నారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రులతో కలసి ఆమె ముందే విదేశాల్లో వాలిపోయింది. ఈ కొత్త ఏడాది జీవితంలో గుర్తిండిపోయేలా జరుపుకుంటానని ముందే ప్రకటించిన ఆమె ఆ తరహాలోనే స్నేహితులతో కలసి విందు, వినోదంలో మునిగిపోయింది. ఎలాంటి సంబరమైన సరే మిత్రులు తోడుంటే అద్భుతంగా ఎంజాయ్‌ చేస్తానని అంటోంది.

English summary
Tamanna says that..."I ensure I don't celebrate New Year in the same place every year. I always spend the special day with my family but in different locations. I don't repeat the celebrations as well. Last time, I had a small party at home and this year, I'm sure not to repeat it. I want my every New Year celebration to be unique and memorable".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu