twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొరటాల లో ఇంత కసి దాగుందా...?? వరుసగా పది సూపర్ హిట్లు ఇవ్వగలను అనటం వెనక ఉన్న కాన్ఫిడెన్సేమిటీ?

    |

    కొరటాల శివ ఇప్పుడు టాలివుడ్ లోకి వచ్చిన మరో "అగ్ర" దర్షకుడు. డైరెక్టర్ ర్ గా మొదటి సినిమా "మిర్చీ"తోనే టాలీవుడ్ లో తన జర్నీ ఎలా ఉండబోతోందో చెప్పేసాడు. దెశన్నే ఒక ఊపు ఊపిన బాహుబలి హవాలోనే సైలెంట్ గా శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తో ఆ విషయాన్ని కంఫర్మ్ చేసేసాడు. ఒక సినిమాని మనం రోజూ ఆలోచించే విషయాలకి కనెక్ట్ చేయటం. ఆ లైన్లుకూడా సమాజానికి ఏదో ఒక రకంగా కాస్త ఉపయోగ పడే కాన్సెప్ట్ కదా అన్న ఆలోచన తెప్పించటం శివ స్టైల్..

    అయితే తాను రైటర్ గా ఉన్నప్పుడు పడ్డ కష్టాలనీ, కెరీర్ లో నిలదొక్కుకునే క్రమం లో ఎదురైన అనుభవాలనీ ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కొరటాల... అదే ఫ్లోలో కొరటాల అన్న మాట ఒక్క సారి అందరి ఫోకస్ కొరటాల వైపుకి మళ్ళింది. ఇంతకీ శివ మాటేమిటో, దాని వెనక కొరటాల శివ కి ఉన్న బలం ఏమిటో తెలుసుకోవాలనుందా..??

    శ్రీమంతుడు వచ్చినప్పుడు కూడా అంతా యావరేజ్ సినిమా అనుకున్నారు...

    శ్రీమంతుడు వచ్చినప్పుడు కూడా అంతా యావరేజ్ సినిమా అనుకున్నారు...

    మహేష్ ఖాతాలో మరో ఇండస్ట్రీ టాక్ అయ్యే మూవీ అవుతుందని కూడా ఎవరూ ఊహించలేక పోయారు. సైలెంట్ గా వచ్చిన ఆ సినిమా టాలీవుడ్ నే ఒక కుదుపు కుదిపింది. గ్రామాల దత్తత అనే కాన్సెప్ట్ తెలంగాణా గవర్నమెంట్ కూడా అధికారికంగా ఆ సినిమాని మెచ్చుకుందంటేనే. కొరటాల ఏ పద్దతిలో ఆలోచిస్తున్నాడో అర్థమైపోతుంది.

    ఒక బలమైన సామాజికాంశాన్ని సినిమా కి సబ్జెక్ట్ గా తీసుకుంటున్నప్పుడు

    ఒక బలమైన సామాజికాంశాన్ని సినిమా కి సబ్జెక్ట్ గా తీసుకుంటున్నప్పుడు

    ఒక స్టార్ హీరో తో కమర్షియల్ హిట్ సాధించటం అనేది కత్తిమీద సాము లాంటిదే. నిజానికి గ్రామాల దత్తత అనే కాన్సెప్ట్ తో ఒక కథని శ్రీమంతుడు సినిమాకి ముందే చెప్పి ఉంటే అదేదో మామూలు సినిమా అనిపించేది, అసలు వర్కౌట్ అయ్యే కథేనా అనే అనుమానమూ వచ్చేది . కానీ కొరటాల స్టైల్ ఆఫ్ మేకింగ్ అదే సబ్జెక్ట్ తో ఇండస్ట్రీ హిట్ సాధించింది.

    ఫార్ములాని

    ఫార్ములాని

    అదే ఫార్ములాని మళ్ళీ రిపీట్ చేసాడు పర్యావరణం మీద ఇంకో సబ్జెక్ట్ మొక్కలని కాపాడటం కోసం ఒక హీరో పోరాటం అనే కథ కూడా ఇంకొకరి ప్రజెంటేషన్ లో ఎలాఉండేదో తెలియదు గానీ, కొరటాల మళ్ళీ జనతా గ్యారేజ్ ని ఇంకో బ్లాక్ బస్టర్ చేసాడు. మొదట ఏ సెంటర్ లకే పరిమితం అనుకున్న జనతా గ్యారేజ్ ఇప్పుడు కోట్లు కొల్లగొడుతోంది.

    జూనియర్ ఎన్టీఆర్ ని ఈ కథ తో ఒప్పించినప్పుడే

    జూనియర్ ఎన్టీఆర్ ని ఈ కథ తో ఒప్పించినప్పుడే

    దాదాపు హిట్ ఖాయం అనే విషయం చాలామందికి అర్థమైపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే రూ. 51 కోట్లు వసూలు చేసింది. అలాగే, కేరళ, అమెరికాల్లోనూ రికార్డు వసూళ్లు రాబట్టింది. అమెరికాలో రూ. 10.5 కోట్లు, కేరళలో రూ. 9.50 కోట్లు వసూలు చేసింది.తొలిరోజు రికార్డు స్థాయిలో రూ. 21 కోట్లు కొల్లగొట్టింది.

    అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్

    అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్

    కెరీర్ లోనే అత్యంత వేగవంతంగా వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో రాజమౌళి 'బాహుబలి' సినిమా రికార్డులను కూడా 'జనతా గ్యారేజ్' అధిగ మించినట్టు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రికార్డుస్థాయిలో వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది.

    ఈనేపథ్యం లో

    ఈనేపథ్యం లో

    ఒక ఇంటర్వ్యూలో కొరటాల అన్న మాటలు ఇంకోసారి అతనికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏమిటో తెలియ జెప్పాయి. ‘‘నా దగ్గర ఇంకో ఏడు కథలున్నాయి. పది బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలని ఉంది. అందుకే రిలాక్స్ గా తీస్తున్నా" అన్న కొరటాల తాను ఇకముందు ఏ స్థయిలో విరుచుకు పడనున్నాడో చెబుతున్నాయి. ఇప్పటి వరకూ తీసిన మూడు సినిమాలూ వరస హిట్లు కొడుతూ కొరటాలని అగ్ర దర్శకుల జాబితాలో చేర్చాయి. ఇక ముందు వచ్చే సినిమాలు కూడా ఇదే దారిలో నడవనున్నాయట.

    "మూడు సినిమాల వరకు ఎలాంటి కాంప్లికేషన్ లేదు.

    రాంగ్ స్టెప్ వేయలేదు. వేసే అవకాశం ఉంది, కాబట్టి అది చాలా చిన్న రాంగ్ స్టెప్ గానే ఉండాలనేది నా కోరిక. నా మొదటి మూడు సినిమాలూ జనాల్లోకి తేలికగా దూసుకుని వెళ్ళాయి " అని చెప్పేటప్పుడే ఏమాత్రం నిర్లక్ష్యం చేయబోవటం లేదూ... ప్రతీ సినిమాకీ నేను మరింత పర్ఫెక్ట్ అవుతున్నా అనే సంకేతాలిచ్చాడు.

    నిర్మాతల దగ్గర కూడా కథ విషయం లో మార్పులు చేయతమో

    నిర్మాతల దగ్గర కూడా కథ విషయం లో మార్పులు చేయతమో

    లేదంటే కొన్ని సీన్ల విషయం లో రాజీ పడటమో జరగలేదు. తాను రాసుకున్న స్క్రిప్ట్ ఏం చెప్పిందో అదే నమ్మి సినిమాగా మలిచాడు... స్నేహితులే నిర్మాతలుగా దొరకడం అతిపెద్ద బెనిఫిట్ అయ్యింది అనీ రెండు బ్యానర్ లతో కూడా తన సినిమాలే మొదలు అవ్వడం తో తానే అన్నీ చూసుకోవాల్సి ఒచ్చింది అనీ కానీ దాన్ని బర్డెన్ గా అనుకోలేదట.

    మొదటి సినిమా మిర్చీ

    మొదటి సినిమా మిర్చీ

    తర్వాతి సినిమా శ్రీమంతుడు కూడా ఆ బ్యానర్లలో వచ్చిన మొదటి సినిమాలు. సినిమా నిర్మాణం లోకి కొత్తగా వచ్చిన సంస్థలు కావటం తో అన్నీ తానే చూసుకోవలసి వచ్చేదట.అయితే అదికూడా కష్టం అనుకోలేదు అనుభవం అనే అనుకున్నాడట. అని శివ చెప్పుకొచ్చారు.

    English summary
    Shiva Koratala said he would be happy if he direct 10 films throughout his career.He has already done three films and so, he would direct another seven films. However, he says, he wants all the seven films to be blockbusters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X