For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రూ. 1000 కోట్ల ఆస్తి ఉంది... హీరో సంచలన ప్రకటన!

  By Bojja Kumar
  |

  సౌత్ సినిమా పరిశ్రమలోని హీరోల్లో తమిళ స్టార్ శింబు తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో ఉంటారు. హీరోయిన్లతో ఎఫైర్లు, నిర్మాతలను ఇబ్బందులకు గురి చేయడం, తోటి తమిళ హీరోలతో గొడవలు పడుతూ రచ్చకెక్కడం లాంటివి గతంలో చూశాం. శింబు సరైన సమయానికి షూటింగుకు వెళ్లక నష్టపోయిన ఫిల్మ్ మేకర్స్ చాలా మందే ఉన్నారు. కొందరైతే ఆయనతో సినిమా అంటేనే భయపడి పారిపోయే పరిస్థితి. చివరకు శింబుతో క్లోజ్‌గా ఉండే గౌతమ్ మీనన్, అదిక్ రవిచంద్రన్, పాండిరాజ్ లాంటి వారు సైతం అతడి లేజీనెస్ మీద ఎన్నోసార్లు విమర్శలు చేశారు.

  మూడు సినిమాలు ప్రకటించడంతో షాక్

  మూడు సినిమాలు ప్రకటించడంతో షాక్

  తాజాగా శింబు పిఆర్ టీమ్ అతడు చేయబోయే నెక్ట్స్ 3 సినిమాలు ప్రకటించారు. ఒక్క సినిమానే అనుకున్న సమయానికి పూర్తి చేయలేని శింబు... ఒకేసారి మూడు సినిమాలు అనౌన్స్ చేయడంపై విమర్శలు వచ్చాయి.

   ప్రెస్ నోట్ విడుదల చేసిన శింబు

  ప్రెస్ నోట్ విడుదల చేసిన శింబు

  ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించడంపై చాలా మంది నుండి కౌంటర్స్ రావడం.... లేజీ ఫెల్లో అంటూ పలువురు విమర్శలు చేయడంతో వారికి సమాధానంగా శింబు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

   రోబోలా బ్రతకడం నాకు చేతకాదు

  రోబోలా బ్రతకడం నాకు చేతకాదు

  ‘మా నాన్నతో నా తొలి సినిమా చేసినప్పటి నుండే నేను షూటింగుకు ఉదయం 10 గంటలకు వచ్చేవాడిని. ఇది నా నిర్లక్ష్యం కాదు... ముందు నుండీ నాకు ఇదే అలవాటు, ఎంతో కంఫర్టబుల్‌ లైఫ్ నాది, అలాగే ఉండటానికి ఇష్టపడతాను, రోబోలా బ్రతకడం నా వల్లకాదు.... అని శింబు వెల్లడించారు.

  1000 కోట్ల ఆస్తి ఉంది

  1000 కోట్ల ఆస్తి ఉంది

  మా తల్లిదండ్రుల డబ్బుతో కాకుండా సొంతగా నేను సంపాదించుకుని సంతోషంగా ఉన్నాను. బహిరంగంగా చెబుతున్నాను నాకు రూ. 1000 కోట్ల ఆస్తి ఉంది. అందుకే నేను మరింత సంతోషంగా జీవించాలని అనుకుంటున్నాను, కానీ కొందరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు అని శింబు తెలిపారు.

  సినిమాలంటే ఇష్టం

  సినిమాలంటే ఇష్టం

  నాకు సినిమాలంటే ఎంతో ఇష్టం. నాకు తెలిసింది కూడా ఇది ఒక్కటే. స్వార్థపరుడిగా ఉండాలనే ఇంటెన్షన్ నాకు ఏమీ లేదు. నేను చేసే పనులు కొందరిని బాధించవచ్చు. దీన్ని మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని శింబు తన ప్రెస్ స్టేట్మెంటులో వెల్లడించారు.

  English summary
  “When I did my first film with my dad, I came for shooting only at 10. It’s not because I don’t care or I take it for granted, I have always lived my life like this. I was pampered and I lived a very comfortable life. I can’t be like a robot which is why it’s very tough for me. Without my parent’s money, I am happy I could establish myself. Openly itself I can tell, I have 1000 crores for myself. So, I can live a life extremely happy, people don’t understand that. But, I love cinema and this is all I know. I don’t have the intention to be selfish and if my actions have hurt others, I will definitely change myself and I am working on it.” Simbu said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more