For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘వదిలి పెట్టను... కొడుకులకు తడిసిపోవాలి’... నటి హేమ ఆగ్రహం ఎవరిపై?

  By Bojja Kumar
  |

  తెలుగు సినీ పరిశ్రమలో సాధారణ నటిగా తెరంగ్రేటం చేసి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, దాదాపు రెండు దశాబ్దాల పాటు సుధీర్ఘంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ప్రముఖ నటి హేమ.

  కామెడీ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆమె... గత ఎన్నికల్లో రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరుపున మండపేట నిజయోజకవర్గం నుండి పోటీ చేశారు.

  ఫైర్ బ్రాండ్ హేమ

  ఫైర్ బ్రాండ్ హేమ

  సినిమాల్లో నవ్వుల హేమగా పేరు తెచ్చుకున్న ఆమె..... ఇండస్ట్రీ సర్కిల్‌లో మాత్రం సీమ టపాకాయలా పేలే ఫైర్ బ్రాండ్‌. ఏ విషయం అయినా మొహం మీదే చెప్పే స్వభావం. తాజా టీవీ 9 జాఫర్ ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ప్రశ్నలకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  Actress Hema Romance With Puri Jagannadh @Shamanthakamani Pre Release Event | Filmibeat Telugu
  ఆంటీ అంటే ఒళ్లుమండిపోయింది

  ఆంటీ అంటే ఒళ్లుమండిపోయింది

  హేమ ఆంటీకి సినిమాల్లో దుకాణం బంద్ అయింది కాబట్టే రాజకీయాల వైపు దృష్టి పెట్టారు అని బయట అనుకుంటున్నారనే ప్రశ్నకు హేమ స్పందిస్తూ.... ఆంటీ అనేసారేంటి? మీరు అలా అంటే నా ఒళ్లు మండిపోయింది, అవకాశాలు లేవు అనడం సరికాదు, సినిమాల్లో బిజీగా ఉన్నపుడే మండపేటలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేశాను అని తెలిపారు.

  పూరికి చెల్లిని, అప్పుడే అవకాశాలు ఇవ్వలేదు...

  పూరికి చెల్లిని, అప్పుడే అవకాశాలు ఇవ్వలేదు...

  మీకు అత్యంత సన్నిహితుడైన పూరిగారు కూడా తల్లి పాత్రలు ఇవ్వడం లేదు? మీరు ఔట్ డేటెడ్ అయిపోయారా? అనే ప్రశ్నకు హేమ సమాధానం ఇస్తూ...ఔట్ డేడెట్ అనడం సరికాదు.... మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, అతడు లాంటి టాప్ సినిమాలు చేస్తూ పీక్ రేంజిలో ఉన్నపుడే నాకు పూరి వేషం ఇవ్వలేదు. పూరికి నేను చెల్లెల్ని, ఇపుడు కూడా నువ్వు మదర్ ఏంటి? మదర్‌గా నిన్ను ఎవరు యాక్సెప్టు చేస్తారు? అంటాడు. అయినా నాకు మదర్ క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేదు. నన్ను ఆంటీ అన్నపుడే ఒళ్లు మండింది అని హేమ సమాధానం చెప్పారు.

  మీడియానే నన్ను ఇలా

  మీడియానే నన్ను ఇలా

  మీడియానే నన్ను నవ్వుల హేమ చేసింది. మీడియానే రెబల్ హేమ చేసింది. ఇపుడు కాపు బ్రాండ్ హేమ అంటున్నారు. కాపులకు ఐడెంటి కావాలని పోరాడటం లేదు. వాళ్లకు న్యాయం జరుగాలని కోరుకుంటున్నాను. కాపుల్లో 70 నుండి 80 శాతం మంది లేనివాళ్లే. మా బంధువులు కూడా మూటలు మోస్తున్నారు. గిన్నెలు తోముతున్నారు. వారు ఓసీల్లో ఉండటం వల్ల చాలా అన్యాయం జరుగుతోంది. ఎన్ని మార్కులు వచ్చినా పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. రాజకీయాల కోసం కాపుల తరుపున మాట్లాడటం లేదు. కాపు ఉద్యమం లేనపుడే తాను రాజకీయాల్లోకి వచ్చాను అని హేమ అన్నారు. ముద్రగడ పద్మనాభం పోరాటం నచ్చి తాను అయనతో కలిశానని చెప్పారు.

  ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి లేదు

  ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి లేదు

  సినీ పరిశ్రమలో పాత్ర కావాలంటే చాలా త్యాగాలు చెయ్యాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేదని, ఇప్పుడైతే అలాంటిదేమీ లేదని హేమ తెలిపారు. తాను 14 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి వచ్చాను. ఒకప్పుడు అలాంటివి జరిగేవని విన్నాను. నాకు అలాంటి పరిస్థితలు ఎప్పుడూ ఎదురుకాలేదు అని హేమ అన్నారు. ఇపుడు ఇండస్ట్రీలో నిర్మాతలు, దర్శకులు వెల్ ఎడ్యుకేటెడ్ వస్తున్నారు. ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి ఉంటే సినీ స్టార్ల పిల్లలు ఇండస్ట్రీలోకి వచ్చే వారు కాదు కదా అని హేమ అన్నారు.

  ప్రపంచం అంతా డబ్బు, సెక్స్ చుట్టూ

  ప్రపంచం అంతా డబ్బు, సెక్స్ చుట్టూ

  ఇపుడు ప్రపంచం అంతా డబ్బు సెక్స్ చుట్టూ తిరుగుతుంది. ఇండస్ట్రీలోనే కాదు ఆడ, మగ ఉన్న అన్ని చోట్ల ఆ రెండింటి గురించే ఉంటుంది. ఇలాంటివి అన్ని చోట్ల ఉన్నపుడు ఇండస్ట్రీలో మాత్రమే అలాంటివి ఉన్నాయనడం సరికాదు అని హేమ అన్నారు.

  డ్రగ్స్ కేసు గురించి

  డ్రగ్స్ కేసు గురించి

  తప్పు ఎక్కడ చేసినా తప్పు తప్పే. ఎవరు తీసుకుంటున్నారో నాకు తెలియదు. డ్రగ్స్ మాఫియా అనేది చాలా డేంజర్. ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దు కోవాలి అని హేమ అభిప్రాయ పడ్డారు.

  న్యూడ్ ఫోటోలతో మార్ఫింగ్

  న్యూడ్ ఫోటోలతో మార్ఫింగ్

  సోషల్ మీడియా అంటే నాకు అస్సలు నచ్చదు. అమ్మమ్మ క్యారెక్టర్లు వేసే వారిని కూడా న్యూడ్ ఫోటోలతో మార్ఫింగ్ చేస్తున్నారు. మాకు ఆడ పిల్లలు ఉంటారు. మా మీద అసభ్యంగా రాస్తే మా ఆడ పిల్లలకు పెళ్లవుతుందా? సినిమా ఆడవాళ్లంటే అంత లోకువా...మా లైఫ్‌తో ఆడుకోవడానికి నువ్వెవరు? అనే కసి ఉంది అని హేమ అన్నారు.

  నా కొడుకులకు తడిసిపోవాలి

  నా కొడుకులకు తడిసిపోవాలి

  సోషల్ మీడియాలో ఇలాంటి పనులు చేసే వారు ఎప్పటికైనా దొరుకుతారు. నా కోసమే కాదు, నా చుట్టూ ఉన్న ఆడ వాళ్ల కోసం పోరాడుతా. వాళ్లని వదలను. ఎప్పటికైనా దీనిపై ఓ రెవెల్యూషన్ తీసుకొస్తాను. ఇండస్ట్రీ అని కాదు. ఏ ఆడపిల్ల మీదైనా ఒక రాతరాయాలన్నా, ఒక ఫోటో క్లిప్పు పెట్టాలన్నా నా కొడుకులకు తడిసిపోవాలి. ఎప్పటికైనా ఆ పని చేస్తాను, మీ చేత శబాష్ అనిపించుకుంటాను అని హేమ అన్నారు.

  English summary
  "I haven’t faced casting couch in tollywood. These days, such things do not happen." Telugu actress Hema said.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X