»   » ప్రభాస్ కమిట్‌మెంట్ నచ్చింది.. ఇన్‌స్పైర్ చేసింది.. రాజమౌళి

ప్రభాస్ కమిట్‌మెంట్ నచ్చింది.. ఇన్‌స్పైర్ చేసింది.. రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిర్చి తర్వాత బాహుబలి1, బాహుబలి2 తప్ప ఏ చిత్రంలో కూడా నటించలేదు. దాదాపు ఐదు సంవత్సరాలు బాహుబలికే దారపోసాడు. బాహుబలి సందర్భంగా ప్రభాస్ చూపిన కమిట్‌మెంట్ తనకు బాగా స్ఫూర్తిని ఇచ్చిందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఒక సినిమాకు ఐదేళ్లు అంకితం

ఒక సినిమాకు ఐదేళ్లు అంకితం

‘ఓ సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ ఉన్న హీరో ఐదేళ్లపాటు ఒక సినిమాకే అంకితమైపోవడమంటే మాటలు కాదు. రెండేళ్లు అనుకున్న సినిమాకు నాలుగేళ్లు పట్టినా నేను అడిగిన దానికంటే ప్రభాస్‌ ఎక్కువ డేట్లు ఇచ్చాడు అని రాజమౌళి తెలిపారు.

సమయం దొరికినా చేయలేదు

సమయం దొరికినా చేయలేదు

‘బాహుబలి' మొదటి భాగం విడుదలయ్యాక వేరే సినిమా చేసే సమయం దొరికింది. నేను కూడా ఈ గ్యాప్‌లో వేరే సినిమా చేయమని చెప్పా. అందుకు మరో చిత్రాన్ని చేయాలని అనుకొన్నాడు. కానీ మనసు మార్చుకుని చేయలేదు

బయటకు వెళ్లలేనని చెప్పాడు

బయటకు వెళ్లలేనని చెప్పాడు

ఎందుకు మనసు మార్చుకొన్నావని ప్రభాస్ అడిగితే ‘బాహుబలి' నుంచి నేను బయటకు వెళ్లలేనని చెప్పాడు. దాదాపు తొమ్మిది నెలలు సమయం చిక్కినా వేరే సినిమా చేయలేదు. అతని కమిట్‌మెంట్‌ నన్ను చాలా ఇన్‌స్పైర్‌ చేసింది అని రాజమౌళి చెప్పాడు.

సుజిత్ సినిమాకు గ్రీన్ సిగ్నల్

సుజిత్ సినిమాకు గ్రీన్ సిగ్నల్

బాహుబలి2 చిత్రం పూర్తయిన తర్వాత ప్రభాస్ తాజాగా ఓ చిత్రానికి పచ్చజెండా ఊపారు. ఈ చిత్రానికి సుజిత్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ప్రభాస్‌కు ఇది 19వ చిత్రం. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం అందిస్తున్నారు. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో ఈ చిత్రం రూపొందుతున్నది.

English summary
After Mirchi Release, Actor Prabhas stick to Baahubali for Five years. Prabhas showed cent percent commitment to Baahubali only. That inspires SS Rajamouli a lot
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu