»   » అందం, ఆల్కాహాల్, వద్దు... ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు : శృతీ హసన్

అందం, ఆల్కాహాల్, వద్దు... ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు : శృతీ హసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందమైన మనిషి అనగానే ముఖ్యంగా చూసేది ఒంటి రంగునే. నల్లగా ఉండటం అంటే అందం తక్కువగా ఉందటం అనే భావన మనలో బాగానే ఇంకిపోయింది. తెల్లని వాళ్ళు గొప్ప నేఅ భావన యూరోపియన్ దేశాలలోనే కాదు, భార్త దేశం లాంటి అన్ని రంగుల కలయిక తో ఉండే దేశం లోనూ బాగానే ఉంది.

అందం అంటే తెల్లగా ఉండటమా..?

అందం అంటే తెల్లగా ఉండటమా..?

వర్ణ వివక్ష ఉండేటట్టయితే మేము దక్షిణాది వళ్ళ తో ఎందుకు కలిసి ఉంటాం అని ఒక కేంద్ర మంత్రి అన్న వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో ఇంకా మర్చి పోలేదు మనం. ఇంతకీ అందం అంటే తెల్లగా ఉండటమా..? రంగు తక్కువున్న వాళ్ళలో అందం తక్కువ ఉన్నట్టా అన్న మాటలు వచ్చినప్పుడు మన సినీ ఇండస్ట్రీ లోనే కాజోల్, రాణీ ముఖర్జీ, దీపిక పదికొణే లాంటి స్టార్లతో పాటు నిన్నటి తరం వాణి శ్రీ, జయసుధ, రేఖ లాంటి హీరోయిన్లూ ఉన్నారు....

పుట్టుక తో వచ్చిన రంగు మారదు

పుట్టుక తో వచ్చిన రంగు మారదు

ఇక సెలబ్రిటీల నుంచి సామాన్య జనం మాటకి వస్తే... రంగు తక్కువ అని భాదపడే వాళ్ళ సంఖ్య తక్కువేం కాదు. పుట్టుక తో వచ్చిన రంగు మారదు అని తెలిసినా. తెల్ల బడటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ ఆత్మన్యూనతని ఆధారం చేసుకొని సౌదర్య సాధనాల మార్కెట్ కొన్ని వందల కోట్ల వ్యాపారం చేస్తోంది.

ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ని ప్రమోట్‌ చేయను

ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ని ప్రమోట్‌ చేయను

అలా బాధపడేవాళ్ల కోసం ఏదైనా ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ గురించి చెబుతారా? అనే ప్రశ్న శ్రుతీహాసన్‌ ముందుంచితే - ‘‘అస్సలు చెప్పను, రంగుతక్కువ ఉన్నాం అనుకోవటం లో భాద నాకు తెలుసు. నేను ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ని ప్రమోట్‌ చేయను. ఎందుకంటే, నా చిన్నప్పటిలా ఇప్పుడు నేను రంగుకి ప్రాధాన్యం ఇవ్వడంలేదు. రంగు తక్కువగా ఉన్నామని ఎందుకు బాధపడాలి? అందుకే ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ని ప్రమోట్‌ చేయను.

 బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయను

బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయను

అలాగే, ఆల్కహాల్‌కి కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయను. ఎందుకంటే, మద్యం ఆరోగ్యానికి హాని చేస్తుంది'' అని చెప్పింది. మొత్తానికి అందం అంటే చర్మం రంగు మీద ఆధారపడి ఉండదనీ, నతన అనే అందం ముందు శారీరక అందం పెద్ద లెక్కలోంది కాదనీ సెలవిచ్చిందన్న మాట శృతీహసన్...

English summary
South Indian Actress Sruthi hasan says she never pramote beauty products and alchohal
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu