»   » చాలా మంది బోయ్ ప్రెండ్స్ ని ఏక్సెప్టు చేయరనే ఆగా

చాలా మంది బోయ్ ప్రెండ్స్ ని ఏక్సెప్టు చేయరనే ఆగా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :''హాలీవుడ్ చిత్రం 'ప్లేయింగ్‌ బై హార్ట్‌'ని చూసినప్పుడంతా నా మనసు లాగుతుంటుంది. ఎలాగోలా నాన్నని ఒప్పించేసి ఆ సినిమాని తెలుగులో ఎప్పుడెప్పుడు తీసేద్దామా అనిపిస్తుంటుంది. కానీ అందులో పాత్రల్ని, మన సంస్కృతినీ పోల్చి చూసుకొన్నాక వెనకడుగు వేయాల్సొస్తుంటుంది. అందులో ఏంజెలీనా జోలిలాంటి పాత్ర గురించి నేను తరచుగా కలలకంటూ ఉండేదాన్ని. అయితే ఓ ఇండిపెండెంట్ అమ్మాయి చాలా మంది బోయ్ ప్రెండ్స్ కలిగి ఉండటం అనేది ఇక్కడ ఏక్సెప్ట్ చేయరు అని ఆగాను'' అంటూ చెప్పుకొచ్చింది లక్ష్మీ ప్రసన్న. అయితే 'చందమామ కథలు'లో నా పాత్ర గురించి చెప్పినప్పుడు సుదీర్ఘమైన నా కల నెరవేరిన అనుభూతి కలిగింది అని వివరించింది. శుక్రవారం ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... నా పాత్ర పేరు లీసాస్మిత్‌. ఆమె ఓ మోడల్‌. బూతులు మాట్లాడుతుంటుంది, సిగరెట్‌ తాగుతుంది, మద్యం సేవిస్తుంటుంది. ఎవ్వరూ ఊహించనటువంటి ఈ పాత్రను నేను ఎందుకు చేశానన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఒక చరిత్రగా నిలిచిపోయే చిత్రమిది. చందమామ కథలు అనగానే చిన్నప్పుడు చదువుకొన్న నీతికథలే గుర్తుకొస్తాయి. ఇందులో కథలు మాత్రం వేరుగా ఉంటాయి. జీవితాలకి సంబంధించిన కథలివి అన్నారామె.

I love

ఇక కథ విన్న వెంటనే ఒప్పుకొన్న సినిమా ఇది. నాలోని నటికి సవాల్‌ విసిరిన మరో పాత్రని ఇందులో పోషించా. ఎప్పుడైనా సరే... ఒక కథ వినగానే ఒంట్లో భయం పుట్టాలి. ఇలాంటి కథకి నేను న్యాయం చేయగలనా? అనే సందేహం కలగాలి. అలాంటి అనుభవం కలిగినప్పుడే సవాల్‌గా స్వీకరించి నటించేందుకు ఒప్పుకొంటా. 'చందమామ కథలు'లో నటించడం వెనక కారణం కూడా అదే. ఇందులో నేను కనిపించే విధానం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది అని చెప్పింది.

అలాగే ''మంచి కథ అనిపిస్తే చాలు... డబ్బుల గురించి ఆలోచించకుండా వెళ్లి నటించి వచ్చేదాన్ని. ఇక నుంచి మాత్రం డబ్బులు తీసుకోవాలనుకొంటున్నా. ఎందుకంటే మా నాన్న ధనవంతుడు కానీ నేను కాదు. ఈ ప్రయాణం సంతృప్తిగానే ఉంది. మనసుకు నచ్చిన కథల్లో నటిస్తున్నా. నిర్మాతగా యువతరం అభిరుచులకు తగ్గ సినిమాలు తీస్తున్నా. 'గుండెల్లో గోదారి' చిత్రం నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ చిత్రం తమిళంలో అంతగా ఆదరణ పొందలేదు కానీ... తెలుగులో మాత్రం లాభాలు తెచ్చిపెట్టింది. ఇకపై నా నిర్మాణంలో మరిన్ని సినిమాలు వస్తాయి''.'' అన్నారు మంచు లక్ష్మీప్రసన్న.

English summary
Manchu Laxmi said..."I love the Hollywood film "Playing by heart" so much. I always has to remake that film with my father playing Sean Connery and me Angelina Jolie. But the people here won't accept an independent girl with many boy friends. So I cannot make that film. But when Praveen Sattaru narrated this story I was really excited and said that this is what I am waiting for and immediately signed the movie."
Please Wait while comments are loading...