»   » మగాడు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చా?.... రేణు దేశాయ్ ఫైర్!

మగాడు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చా?.... రేణు దేశాయ్ ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Renu Desai Expressed Her Worry About Today's Society And Mindset Of Men

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి అంశంపై మాట్లాడిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా 7 ఏళ్లుగా పిల్లలను చూసుకుంటూ పుణెలో ఉంటున్న ఆమె.... తనకు ఇపుడు ఒక లైఫ్ పార్ట్‌నర్ ఉంటే బావుండనిపిస్తుందనే తన మనసులోని ఆలోచనను బయట పెట్టారు.

అయితే పవన్ కళ్యాణ్‌తో విడిపోయినప్పటికీ.... ఆమెను తమ వదినమ్మగా భావిస్తున్న కొందరు అభిమానులు ఆమె రెండో పెళ్లి ఆలోచన చేయడాన్ని సహించలేక పోతున్నారు. ఆమె సెకండ్ మ్యారేజ్ థాట్స్ మీద తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశారు. దీనిపై రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు.

ఛీ ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నామా?

ఛీ ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నామా?

ఇవి కేవలం నన్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని నేను అనుకోవడం లేదు. కానీ ఇలాంటి కామెంట్స్ చదివినపుడు అసలు మనం ఇలాంటి సమాజంలో, ఇలాంటి మైండ్ సెట్‌లో ఉన్న మగవాళ్ల మధ్య బ్రతుకుతున్నామా? అని చాలా ఆందోళన అనిపిస్తుంది.... అని రేణు దేశాయ్ అన్నారు.

చేతల్లో కనిపించడం లేదు

చేతల్లో కనిపించడం లేదు

ఒక వైపు ఉమెన్ ఈక్వాలిటీ, ఆడపిల్లల శక్తి, రేప్స్ నుండి సెక్యూరిటీ, భద్రత గురించి మాట్లాడుతున్నాము.... కానీ ఇవన్నీ మాటల్లోనే తప్ప మగాళ్ల మైండ్ సెట్లో లేవని రేణు దేశాయ్ అన్నారు.

రెండో పెళ్లి చేసుకుంటానంటే ద్వేషిస్తారా?

రెండో పెళ్లి చేసుకుంటానంటే ద్వేషిస్తారా?

7 సంవత్సరాల నుండి నేను ఒంటరిగా ఉండి, ఇపుడు నాకు ఒక లైఫ్ పార్ట్‌నర్ ఉంటే బావుండు అని జస్ట్ నా అభిప్రాయం వ్యక్తం చేసినందుకు నాకు హేట్ ముసేజెస్ పంపిస్తున్నారు..... అంటూ కొందరు మగాళ్ల తీరును ఆమె తప్పుబట్టారు.

మగాడు ఎన్నిపెళ్లిళ్లైనా చేసుకోవచ్చా?

మగాడు ఎన్నిపెళ్లిళ్లైనా చేసుకోవచ్చా?

మన దేశంలో ఒక మగాడు ఏమైనా చేయవచ్చు. ఎన్ని సార్లైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ... ఒక అమ్మాయి ఇంకో రిలేషన్ గురించి ఆలోచించడం కూడా తప్పు. తను లైఫ్ లాంగ్ తప్పు చేశానన్న ఫీలింగుతో ఒంటరిగా బ్రతకాలా?.... అంటూ రేణు దేశాయ్ ప్రశ్నించారు.

మీ చేతుల్లోనే...

మీ చేతుల్లోనే...

ఈ దేశంలో అమ్మాయిల ఫ్యూచర్ బాగుండాలంటే మహిళలే వాళ్ల కొడుకులను పద్దతిగా పెంచాలి. అప్పుడైనా మగవాళ్ల మైండ్ సెట్ లో మార్పు వస్తుందేమో...... అంటూ రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు.

రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకోవద్దంటూ

రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకోవద్దంటూ

మీరు మరో పెళ్లి చేసుకోవద్దు... అంటూ ఓ వ్యక్తి పంపిన సందేశాన్ని రేణు దేశాయ్ అభిమానులతో పంచుకున్నారు.

హేట్ మెసేజ్

హేట్ మెసేజ్

మీరు మరో పెళ్లి చేసుకుంటే హేట్ చేస్తాను అంటూ మరో వ్యక్తి పంపిన సందేశాన్ని రేణు దేశాయ్ షేర్ చేశారు.

English summary
Sharing her thoughts about today's society and mindset of men, Renu Desai expressed her worry about the kind of environment we're living in. "I'm feeling worried because we speak about women equality, the power of females, security from rapes on one side, and another side we give a message that a woman should not remarry", she stated.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu