»   » నన్నెవరూ విమర్శించనక్కర్లేదు...రవితేజ

నన్నెవరూ విమర్శించనక్కర్లేదు...రవితేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నన్నెవరూ విమర్శించనక్కర్లేదు. నేను సెల్ఫ్ క్రిటిక్‌ని. నన్ను నేనే విమర్శించుకుంటా అంటున్నారు రవితేజ. ఆయన పుట్టినరోజు సందర్బంగా కలిసిన మీడియా ఆయన్ని మీ సినిమాలన్నీ ఒకే రకంగా ఉంటాయనే పేరుంది అని అడిగితే అలా స్పందించారు. అలాగే నా వయసు 24 యేళ్ల వద్ద నిలిచిపోయింది. ఇప్పుడు నా వయసు అంతే అనుకుంటా. నేనెప్పుడు పోయినా 24 ఏళ్ల వయసు వాడిగానే పోతా. నా మైండ్‌సెట్ అది. అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉంటా అన్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు గురించి మాట్లాడుతూ... ప్రస్తుతం 'వీరా' షూటింగ్ జరుగుతోంది. ఇది హైవోల్టేజ్ ఫిల్మ్. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా నడిచే సినిమా. మధ్యలో రాంగోపాల్ వర్మ 'దొంగల ముఠా' చేస్తున్నా. ఐదు రోజుల్లో ఆ సినిమా పూర్తవుతుంది. వర్మ ఐడియా నచ్చి ఆ సినిమా చేస్తున్నా. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో 'నిప్పు' సినిమా చేయబోతున్నా. వైవీఎస్ చైదరి దానికి నిర్మాత. గుణశేఖర్ శైలికి, నా శైలి మిక్సయితే ఎలా ఉంటుందో, అలాగే ఉంటుంది ఆ సినిమా అన్నారు. రీసెంట్ చిత్రం మిరపకాయ గురించి చెపుతూ.. ఇప్పటివరకు నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ 'కృష్ణ'. దాన్ని 'మిరపకాయ్' మించుతుందని అంటున్నారు అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu