For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మళ్ళీ పెళ్ళి చేసుకోక ముందే తల్లి అవుతుందట , సినిమాల్లోకి రీ ఎంట్రీ కూడా

  |

  గతంలో 'క్రిమినల్', 'బొంబాయి', 'బాబా' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ మనీషా కొయిరాల. ఇటీవలే తను కాన్సర్ కి గురైంది, దాని కోసం చాలా రోజులు ట్రీట్ మెంట్ తీసుకొని పూర్తిగా కోలుకున్నాక మనీషా కొయిరాల మళ్ళీ పబ్లిక్ లోకి వస్తోంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, భర్తతో విభేదాల కారణంగా పెళ్ళిని పెటాకులు చేసుకుందామె. ప్రస్తుతం ఒంటరిగానే జీవితం గడుపుతోన్న మనీషా కొయిరాలా, ఓ అమ్మాయిని దత్తత తీసుకోనున్నట్లు వెల్లడిరచింది.కొంత కాలం భారతదేశాన్ని ఉర్రూతలూగించిన ఆ అందాల తార ఇటీవల క్యాన్సర్ బారిన పడి తిరిగి కోలుకున్న సంగతి తెలిసిందే.

  దాదాపు నాలుగేళ్ల క్రితం నేపాల్ కి చెందిన సామ్రాట్ దహల్ ని మనీషా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ రెండేళ్లు వీళ్ల కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్థలు ఏర్పడటంతో విడిపోయారు. అనంతరం మనీషా కేన్సర్ బారిన పడటం, చికిత్స చేయించుకోవడం ఇవన్నీ తెలిసిందే. ఇక ఇలా ఒంటరిగా మిగిలిపోకుండా ఓ తోడు వెతుక్కోవాలనుకుంటున్నానని తన సన్నిహితుల దగ్గర మనీషా చెబుతోందట. ముందు పాపను దత్తత తీసుకుని, తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలనుకుంటోందట. మరిన్ని వివరాలు స్లైడ్ షో లో...

  క్యాన్సర్ కాటు:

  క్యాన్సర్ కాటు:

  కథానాయికగా దక్షిణ, ఉత్తరాది తెరలను ఓ రేంజ్ లో అలరించింది మనీషా కొయిరాలా. దాదాపు ఏడాది క్రితం ఈ నేపాలీ సుందరి కి కేన్సర్ సోకిన విషయం బయటపడింది. ఒవేరియన్ కేన్సర్ అని తేలడంతో విదేశాలు వెళ్లి, చికిత్స చేయించుకుంది మనీషా. అక్కణ్ణుంచి సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా తిరిగొచ్చిందామె.

   మళ్లీ పెళ్లి

  మళ్లీ పెళ్లి

  ఇక తిరిగి వచ్చినప్పటినుంచీ విపరీతమైన భక్తి లో మునిగి పోయింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటోంది.అలాగే కేన్సర్ కి సంబంధించిన అవగాహనా శిబిరాల్లో పాల్గొంటోంది మనీషా. వ్యక్తిగతంగా కూడా తన జీవితానికి సంబంధించిన కొన్ని ప్రణాళికలు చేసుకుంటోంది. త్వరలో ఒక పాపను దత్తత తీసుకోవాలని అనుకుంటోందట. అలాగే, మళ్లీ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటోందని సమాచారం.

   పాపని దత్తత తీసుకొని

  పాపని దత్తత తీసుకొని

  నేను ఓ అమ్మాయిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను.. అయితే అది ఇప్పటికిప్పుడు కాదు.. వచ్చే ఏడాది. ఎందుకంటే, నేను క్యాన్సర్‌ బారిన పడి కోలుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. ప్రస్తుతం పూర్తిగా క్యాన్సర్‌ని జయించినా, డాక్టర్లు నాకు మూడేళ్ళ సమయం ఇచ్చారు. ఆలోగా తిరిగి క్యాన్సర్‌ తిరగబెట్టే అవకాశాలున్నాయి. అందుకే.. వచ్చే ఏడాదితో ఆ గడువు పూర్తవుతుంది గనుక, పూర్తిగా నేను ఆరోగ్యంగా వున్నానని డాక్టర్లు నిర్ధారించిన వెంటనే ఓ అమ్మాయిని దత్తత తీసుకుంటాను..'' అనిచెప్పింది మనీషా కొయిరాలా

   2012 లోనే విడాకులు

  2012 లోనే విడాకులు

  44 ఏట ఉన్న తాను త్వరలో తన భాగస్వామిని ఎంచుకుంటానని.. ఈ మధ్యలో దత్తత తీసుకునే బిడ్డ సంరక్షణ కోసం పాటుపడుతానని మనీషా కొయిరాలా తెలిపింది. అందరిపట్ల ప్రేమతో ఉండే తనకు చేదు అనుభవమే మిగిలిందని ఆమె చెప్పుకొచ్చింది. 2010వ సంవత్సరం నేపాల్‌కు చెందిన సామ్రాట్ అనే వ్యాపారవేత్తను మనువాడిన మనీషా కొయిరాల 2012లో మనస్పర్ధల కారణంగా సామ్రాట్‌ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

   కల్కి భగవాన్ భక్తురాలు

  కల్కి భగవాన్ భక్తురాలు

  క్యాన్సర్ నుంచి బయటపడ్డాక కొన్ని సంవత్సరాలు రెగ్యులర్‌గా చిత్తూరు జిల్లాలోని 'వన్‌నెస్ యూనివర్శిటీ' లో వచ్చి ఉండిపోయేది. ఎక్కువ సమయం అక్కడ ధ్యానం లో మునిగి పోయేది.. ఇదొక ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. చిత్రూరు జిల్లా వరదయ్య పాలెం సమీపంలోని బట్టవల్లం వద్ద ఈ వన్ నెస్ యూనివర్శిటీ ఉంది. ఇక్కడే ఆంవె తన మానిసిక బలాన్ని పెంచుకోవటానికి

   రెండు సినిమాలు

  రెండు సినిమాలు

  హిందీలో ‘డియర్ మాయ', ‘మౌలాలి' సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. వ్యక్తిగత జీవితం గురించి మనీషా మాట్లాడుతూ - ‘‘వచ్చే ఏడాది ఓ అమ్మాయిని దత్తత తీసుకోవాలనుంది. నా కుటుంబ సభ్యులు నేపాల్‌లో ఉంటారు. ముంబయ్‌లో సెటిలయ్యాక ఒంటరిగా ఫీలవుతున్నా. ఓ మనిషి తోడు అవసరం అనిపించింది. అందుకే ఎవరినైనా దత్తత తీసుకోవాలని ఉంది. పెళ్లి కంటే ముందు దత్తత తీసుకోవాలనుకుంటున్నా'' అన్నారు.

  English summary
  I feel lonely when I come back to an empty house. There's a need for human bonding, I've wanted to adopt since I was a child," she reveals.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X