»   » వీడు ఇంకా న‌టిస్తున్నాడా అనిపించుకోకూడ‌దు: చిరంజీవి కామెంట్

వీడు ఇంకా న‌టిస్తున్నాడా అనిపించుకోకూడ‌దు: చిరంజీవి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటుడికి ఎన్ని పాత్రలు చేసినా సంతృప్తి ఉండదు. ఎన్ని పాత్ర‌లు చేసినా ఇంకా ఏదో చేయాల‌ని ఉంటుంది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు చ‌నిపోయే వ‌ర‌కు న‌టిస్తూనే ఉన్నారు. ప్ర‌తి ఆర్టిస్టు చ‌నిపోయే వ‌ర‌కు న‌టించాల‌నే అనుకుంటాడు. అయితే...ప్రేక్షకులు మ‌నం తెర పై క‌న‌ప‌డితే ఎంజాయ్ చేసేలా ఉండాలి కానీ...వీడు ఇంకా న‌టిస్తున్నాడా అనిపించుకోకూడ‌దు... అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

తన 150వ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన చిరంజీవి ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. తనలో సత్తా ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటానని చిరంజీవి చెప్పుకొచ్చారు. తన చేయబోయే తర్వాతి సినిమాల వివరాలు సైతం వెల్లడించారు.

నెక్ట్స్ చేయబోయే మూవీస్

నెక్ట్స్ చేయబోయే మూవీస్

150వ సినిమా తర్వాత నా కోసం..... ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి అనే క‌థ రెడీ చేస్తున్నారు. ధృవ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఓ డిఫ‌రెంట్ స్టోరీ రెడీ చేస్తున్నాడు. బోయ‌పాటి శ్రీను 152వ సినిమా కోసం క‌థ రెడీ చేస్తున్నాడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

అందులో నేను జీరో

అందులో నేను జీరో

నేను రికార్డ్స్ గురించి ప‌ట్టించుకోను. ఆ విష‌యంలో నాకు జీరో నాలెడ్జ్. ఖైదీ నెం 150 తొలి రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది అనే లెక్క‌లు రామ్ చరణ్ చ‌ర‌ణ్ చూసుకుంటాడు అని చిరంజీవి తెలిపారు.

దాన్ని రాజకీయం చేయొద్దు

దాన్ని రాజకీయం చేయొద్దు

ప్రీ రిలీజ్ ఫంక్షన్ వాయిదా పడటం, వేదిక మారడం లాంటి వాటిని రాజకీయం చేయొద్దు. కోర్టు ఆర్డర్ గురించి తెలుసుకోకుండా ముందు అధికారులు అనుమ‌తి ఇచ్చారు. ఆ త‌ర్వాత తెలుసుకోవ‌డంతో క్యాన్సిల్ అయ్యింది. అంతే త‌ప్పా దీనికి వెన‌క ప్ర‌చారంలో ఉన్న‌ట్టు రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయని నేను అనుకోవ‌డం లేదు అన్నారు చిరంజీవి.

అంత టాలెంట్ నాకు లేదు

అంత టాలెంట్ నాకు లేదు

అమీర్ ఖాన్ పీకె తరహాలో సినిమా చేస్తారా? అనే ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ... పికె లో ఫ‌స్ట్ సీన్ లేకుండా ఉంటే చేస్తాను. అమీర్ ఖాన్ గ్రేట్ యాక్ట‌ర్. అంత టాలెంట్ నాలో ఉంది అనుకోవ‌డం లేదు. అమీర్ ఖాన్ నాతో క‌లిసి న‌టించాలి అని చెప్ప‌డం నాలో ఉత్సాహాన్ని ఇస్తుంది. మేమిద్ద‌రం క‌లిసి చేసే క‌థ కుదిరితే చేస్తాం అని చిరంజీవి తెలిపారు.

అలాంటి కథలు మనవాళ్లకు చెప్పడం లేదు

అలాంటి కథలు మనవాళ్లకు చెప్పడం లేదు

స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ ఉన్న సినిమాలు తెలుగులో ఎందుకు రావడం లేదు అనే ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ.... తెలుగులోనూ వస్తున్నాయి కానీ తక్కువ. వెంక‌టేష్ గురు చేస్తున్నాడు క‌దా. కాక‌పోతే బాలీవుడ్ లో వ‌చ్చినంత‌గా తెలుగులో రావ‌డం లేదు దానికి కార‌ణం అలాంటి క‌థ‌లు మన స్టార్స్ ఎవరూ చెప్పడం లేదు అని చిరంజీవి అభిప్రాయ పడ్డారు.

సోద‌రుడు బాల‌కృష్ణ సినిమా విజ‌యం సాధించాలి అని చెప్పాను

సోద‌రుడు బాల‌కృష్ణ సినిమా విజ‌యం సాధించాలి అని చెప్పాను

సంక్రాంతికి హెల్తీ కాంపిటీషనే ఉంది. బాల‌కృష్ణ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ప్రారంభోత్స‌వంకు నేను వెళ్లాను. సోద‌రుడు బాల‌కృష్ణ సినిమా విజ‌యం సాధిచాలి అని చెప్పాను. 100వ సినిమాకి అలాంటి చారిత్రాత్మ‌క క‌థ‌ను ఎంచుకోవ‌డంలోనే తొలి విజ‌యం సాధించిన‌ట్టు అని చెప్పాను. సంక్రాంతికి వ‌చ్చే అన్ని సినిమాలు విజ‌యం సాధించాలి అని కోరుకుంటున్నాను అని చిరంజీవి తెలిపారు.

రీమేక్ ఎంచుకోవడానికి కారణం

రీమేక్ ఎంచుకోవడానికి కారణం

150వ సినిమా రిమేక్ కథతో చేయాలని అని ముందే డిసైడ్ కాలేదు. అంతకంటే ముందు చాలా కథలు విన్నాం. 150వ సినిమా కాబట్టి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు సోష‌ల్ మెసేజ్ ఉండాలి అనుకున్నాను. ఠాగూర్, స్టాలిన్ త‌ర‌హాలో ఉండే సినిమా అయితే బావుంటుందనే ఆలోచనతోచేయాలి అనుకున్నాను. కానీ అనుకున్న కథ దొరకలేదు. ఆ టైమ్ లో త‌మిళ మూవీ క‌త్తి చూశాను. నాతో పాటు అంద‌రికీ సంతృప్తిక‌రంగా అనిపించింది. ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది అనిపించింది చేశాం. అంతకు మించి మరేమీ లేదు అన్నారు చిరంజీవి.

అందరు కోరుకున్నారు కాబట్టే

అందరు కోరుకున్నారు కాబట్టే

ఈ టైమ్ లోనే 150వ సినిమా చేయాలి అని ముందుగా ఏమీ అనుకోలేదు. రాజ‌కీయంగా స్ధ‌బ్ధ‌త ఉన్న టైమ్ లో సినిమాలోకి రమ్మ‌ని మిత్రులు, శ్రేయోభిలాషులు అన‌డం...ముఖ్యంగా అమితాబ్, ర‌జ‌నీకాంత్ లు కూడా న‌న్ను సినిమా చేయ‌మ‌న్నారు. అందరూ ఇంత‌లా చెబుతుంటే ఎందుకు చేయ‌కూడ‌దు అనిపించే సినిమా చేశాను అని చిరంజీవి తెలిపారు.

రీమేక్ అయినా, కొన్ని మార్పులు

రీమేక్ అయినా, కొన్ని మార్పులు

క‌త్తి సినిమాకు, ఖైదీ నెం 150కి ఏమైనా మార్పులు, చేర్పులు అంటే.... కొన్ని చేసాం. క‌త్తిలో అస‌లు కామెడీ ఉండ‌దు. ఇందులో కామెడీ యాడ్ చేశాం. అలాగే సాంగ్స్ ను కూడా సిట్యూవేష‌న్ త‌గ్గ‌ట్టు ఉండేలా చేశాం. మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు, డైలాగ్స్ విష‌యంలోనూ కొన్ని... మార్పులు చేసామని చిరంజీవి తెలిపారు.

డాన్సులు

డాన్సులు

సినిమాలకు దూరం అయిన తర్వాత మళ్లీ డాన్స్ ప్రాక్టీస్ చేయలేదు. మా అమ్మాయి శ్రీజ పెళ్లి సమయంలో ఒకసారి డాన్స్ చేసాను. చాలా సార్లు పాటలు విన్నపుడు డాన్స్ చేయాలనిపించేది కానీ రేసు గుర్రం సినిమాలో శృతి హాసన్ తరహాలో లోలోపలే అన్ని చేసే వాడిని అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

English summary
"In the years I stayed away from acting, I never practiced dancing. But whenever I listen to a foot tapping number, I’d be thinking how I’d dance to it, even though I don’t show it. In a way, I’m like Shruti Haasan in Race Gurram." Chiranjeevi said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X