»   » నేను రైట్ నెంబర్నే కిస్ చేసాను....అమల గురించి నాగార్జున ఆసక్తికర ట్వీట్!

నేను రైట్ నెంబర్నే కిస్ చేసాను....అమల గురించి నాగార్జున ఆసక్తికర ట్వీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, అమల హీరో హీరోయిన్లుగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'శివ' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో తనతో పాటు నటించిన అమలతో నాగార్జున ప్రేమలో పడటం, తర్వాత ఆమెనే పెళ్లి చేసుకోవడం తెలిసిందే.

శివ షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకుంటూ రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసారు. శివ సినిమాలో 'కిస్ మి రాంగ్ నెంబర్' సాంగ్ చిత్రీకరణ సమయంలో నాగార్జున అండ్ అమల అంటూ ఓ పోటోను షేర్ చేసారు.

రైట్ నెంబర్నే కిస్ చేసాను

రైట్ నెంబర్నే కిస్ చేసాను

వర్మ ట్వీట్ చూసిన నాగార్జున స్పందిస్తూ.... 'ఈ ఫోటో నన్ను మళ్లీ అందమైన పాతజ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది. కానీ నేను రాంగ్ నెంబర్ కిస్ చేయలేదు... రైట్ నంబర్నే నే కిస్ చేశాను' అంటూ అమలను ఉద్దేశించి నాగార్జున కామెంట్ చేసారు.

నాగార్జున, అమల ప్రేమ వివాహం

నాగార్జున, అమల ప్రేమ వివాహం

నాగార్జున, అమల ఇద్దరిదీ లవ్ మ్యారేజే అనే సంగతి తెలిసిందే. 1992లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.

అలా ప్రేమ మొదలైంది

అలా ప్రేమ మొదలైంది

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.... తెలుగులో 'కిరాయి దాదా' విడుదలయ్యాక నాగార్జునతో కలిసి ఐదు సినిమాల్లో నటించా. షూటింగ్‌లోనే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించిందని తెలిపారు.

పెళ్లయ్యాక సినిమాలకు దూరం

పెళ్లయ్యాక సినిమాలకు దూరం

ప్రేమ ఆ విషయం మా అమ్మకు చెప్పాను. దాంతో వెంటనే తనే పెళ్లికి ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే మొదట్నుంచీ నేను సరైన నిర్ణయాలే తీసుకుంటానని తన నమ్మకం. పెళ్లయ్యాక ఇంటి బాధ్యతల కోసం సినిమాలకు దూరం అవ్వాలన్న నా ఆలోచననీ అమ్మ శభాష్‌ అని మెచ్చుకుందని అమల గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

English summary
"Me with iamnagarjuna and Amala at the shoot of "Kiss me wrong number" song from SHIVA" RGV tweeted a photo. "Hey RGVzoomin this brings back such beautiful memories/But I said kiss me right number" Nagarjuna Responded.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X