»   » నాగబాబు తిట్ల ఎఫెక్ట్: మెగా ఫ్యామిలీకి సారీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ

నాగబాబు తిట్ల ఎఫెక్ట్: మెగా ఫ్యామిలీకి సారీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ

Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ఖైదీ నెం 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ..... మెగా బ్రదర్ నాగబాబు రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమ నుండి ముంబై వెళ్లి అక్కడ సినిమాలు తీసుకుంటున్న ఒకడు ట్విట్టర్లో ఎప్పడూ ఏదో ఒకటి వాగుతుంటాడు, వాడో అక్కు పక్షి...వాడికి ఇపుడు సినిమాలు తీయడం చేతకావడంలేదు, పిచ్చికూతలు కూస్తాడు. ముందు వాడు మంచి సినిమాలు తీయడంపై దృష్టి పెడితే బాగుంటుందిని హెచ్చరించారు.

rgv

నాగబాబు కామెంట్స్‌తో రామ్ గోపాల్ వర్మ వెంటనే ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. చిరంజీవికి క్షమానణలు చెబుతూ ట్వీట్స్ చేసారు.

'నాగబాబు గారు మీరు ట్విట్టర్లో లేరు కాబట్టి నా ఈ ట్వీట్లు మీకు ఎవరైనా చూపిస్తారని ఆశిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేనేదో నా స్టైల్ లో అందరి మీదా, అన్నింటి మీదా ఏదో ఒక ఓపీనియన్ చెబుతూ ఉంటాను. వొట్టి మీ ఫ్యామిలీ మీదే కాదు. నా ట్వీట్లు మోడీ గారి దగ్గరి నుండి బచ్చన్ గారి వరకు, చివరకు నా మీద నేను కామెంట్స్ చేసుకుంటూ ఉంటాను. కానీ మీరు చాలా అఫెండ్ అయి హర్ట్ అయ్యారని నాకు తెలిసింది కనుక నేను జెన్యూన్ గా మీకు, మీ ఫ్యామిలీకి సారీ చెబుతున్నాను. నా ఉద్దేశ్యం వేరే అయినా మీరు హర్ట్ అయ్యారు కనుక చిరంజీవి గారికి కూడా నా తరుపున దయచేసి సారీ చెప్పండి. థాంక్స్' అంటూ వర్మ ట్వీట్ చేసారు.

English summary
"I say sorry to Chiranjeevi and his family" Ram Gopal Varna tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu