»   » మూడేళ్ళ క్రితమే తాగడం మానేశానంటూ దర్శకుడు మురగదాస్ ట్వీట్

మూడేళ్ళ క్రితమే తాగడం మానేశానంటూ దర్శకుడు మురగదాస్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ మూడేళ్లుగా కార్పోరేట్ కంపెనీలకు చెందిన కూల్ డ్రింక్ లను తాగడాన్ని మానేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

'మూడేళ్ల కిత్రం 'కత్తి' సినిమా కథ రాస్తున్నప్పుడు వీటిని తాగడం మానేశా. ఇప్పుడు నా షూటింగ్‌ స్పాట్‌లో కూడా నిషేధించాం' అని మురుగదాస్‌ ట్వీట్‌ చేశారు.

I stopped drinking Pepsi or coke: A.R.Murugadoss

మురుగదాస్‌ దర్శకత్వంలో 'కత్తి' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శీతలపానీయాల తయారీ వల్ల గ్రామాల్లోని నీటి వనరులు కలుషితం అవుతున్న కథాంశాన్ని చర్చించారు. మురుగదాస్‌ ఈ కథను కమర్షియల్‌ హిట్‌ కోసమే రాయకుండా, హృదయానికి దగ్గర చేసుకున్నారు. అందుకే 'కత్తి' చిత్రం కథను రాస్తున్నప్పుడే తాగడం మానేశారట.

జల్లికట్టును అడ్డుకుంటున్న పెటా సంస్థను నిషేధించాలని తమిళనాడులో విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలకు పలు వ్యాపార సంఘాలు, సినీ పరిశ్రమ ప్రముఖులు, అనేక రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ఇస్తున్నారు. జల్లికట్టు నిర్వహణ కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తూ తమిళనాడులో విదేశీ శీతల పానీయాలైన పెప్సీ, కోకాకోలా విక్రయాలు నిలిపివేస్తున్నామని వ్యాపార సంఘాలు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

తమిళ రాష్ట్రంలోని అనేక సినిమా థియేటర్లలో పెప్సీ, కోకాకోలా శీతలపానీయాల విక్రయాలను నిషేధించారు. పెప్సీ, కోకాకోలా స్థానంలో స్వదేశీయంగా తయారు అవుతున్న గోలీ సోడా, కలర్ సోడా, నిమ్మకాయ సోడాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో గోలీసోడాకు క్రేజ్ పెరిగిపోతోంది.

ఎలాగైనా మన దేశంలో తయారవుతున్నసోడాలకు ఇప్పుడు భలే గిరాకి వచ్చిందని సినిమా థియేటర్లకు వెలుతున్న సినీ అభిమానులు అంటున్నారు. అంతే కాకుండా చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని వివిద జిల్లాల్లో గోలీ సోడాల విక్రయాలు ఊపందుకున్నాయి.

రీసెంట్ గా చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నెంబర్ 150 చిత్రం 'కత్తి' రీమేక్ కావటం విశేషం. ఈ చిత్రం ఇక్కడా ఘన విజయం సాధించింది. ఇక మురగదాస్ ప్రస్తుతం తెలుగు సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. సంభవామి టైటిల్ ని ఈ చిత్రానికి పరిశీలిస్తున్నారు.

English summary
A.R.Murugadoss ‏ tweeted: I stopped drinking Pepsi or coke since 3 years while I started writing kaththi, Now it's also banned from our shooting spot 👍
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu