»   »  బెంగుళూరులో...అల్లు అర్జున్ అదరగొట్టాడంతే! (ఫోటోస్)

బెంగుళూరులో...అల్లు అర్జున్ అదరగొట్టాడంతే! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దక్షిణాది చిత్ర సీమలో తన మార్కెట్ ను పెంచుకునేందుకు, సౌత్ స్టార్ అనే పేరు తెచ్చుకునేందుకు తనదైన రీతిలో ముందుకు సాగుతున్నారు. ఆయా సినీ రంగాలకు చెందిన ప్రేక్షకుల ఆదరణ పొందాలంటే కేవలం యాక్టింగ్, డాన్సింగ్ మాత్రమే కాదు... వారి వారి బాషల్లో మాట్లాడి వారి మనసు గెలుచుకోవాలనే విషయాన్ని ముందుగానే కనిపెట్టినట్లున్నాడు బన్నీ.

తన తాజా చిత్రం 'సరైనోడు' ప్రమోషన్లో భాగంగా గురువారం బెంగుళూరు వెళ్లిన బన్నీ అక్కడ మీటింగులో కన్నడలో మాట్లాడి అదరగొట్టాడు. అల్లు అర్జున్ కన్నడ భాషలో మాట్లాడడంతో... అభిమానులు విజిల్స్, కేరింతలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. కిక్కిరిసిన అభిమానుల సమక్షంలో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు.

నాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో తెలుగు తర్వాత కర్ణాటకలో ఉన్న అభిమానులు ప్రత్యేకం. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రతీ ఒక్క మెగాభిమానికి, ప్రేక్షకులకు ఏంతో రుణపడి ఉంటాను. నా చిత్రాలు ఇక్కడ ఆడుతున్న విధానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కన్నడ చిత్రాల్ని నేను ఎంతో గౌరవిస్తాను. ఇక్కడి సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. నాకు రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఆ ఫ్యామిలీ హీరోలతో కలిసి పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను అన్నారు.

సౌత్ స్టార్ కావాలనేదే లక్ష్యం

సౌత్ స్టార్ కావాలనేదే లక్ష్యం


తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం అన్నారు.

త్వరలో..

త్వరలో..


త్వరలోనే తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రం చేయబోతున్నట్లు తెలిపారు.

సరైనోడు

సరైనోడు


సరైనోడు పూర్తి స్థాయి మాస్ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటరై టనర్. డైరెక్టర్ బోయపాటి అందరినీ ఆకట్టుకునేలా రూపొందించారని తెలిపారు.

రిలీజ్

రిలీజ్


సరైనోడు చిత్రం ఈ నెల 22న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

English summary
Stylish Star Allu Arjun, who is always keen on exploring different markets, was in Bangalore to promote his Friday release, Sarrainodu. The actor, who interacted with FilmiBeat revealed that he is focusing on establishing himself as a South Indian star.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu