»   » ఇంద్రాణి నా అభిమాని: రాఖీ సావంత్, ఆసక్తిర విషయాలు చెప్పింది

ఇంద్రాణి నా అభిమాని: రాఖీ సావంత్, ఆసక్తిర విషయాలు చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇంద్రాణి ముఖర్జియా ఒకప్పుడు తనకు పెద్ద అభిమాని అని ప్రముఖ నటి, ఐటం డ్యాన్సర్ రాఖీ సావంత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కూతురు షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీయా ప్రధాన నిందితురాలు. ఈ కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తోన్న విషయం తెలిసిందే.

షీనా హత్య కేసు ఆధారంగా ఏక్‌ కహానీ జూలీ కీ అనే సినిమా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో ప్రధాన పాత్రలో రాఖీ సావంత్‌ నటించనుంది. ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. తనకి షీనా బోరా, ఇంద్రాణి ముఖర్జియా, పీటర్‌ ముఖర్జియా బాగా పరిచయస్తులన్నారు.

Rakhi Sawant

పీటర్‌ ముఖర్జియా నిర్మాణంలో వచ్చిన రియాల్టీ షోలు జరుగుతున్నప్పుడు షూటింగ్‌ సమయంలో సెట్‌లో కలిసినట్లు చెప్పింది. కాగా, రాఖీ సావంత్ తాజా ఈ చిత్రం షీనా బోరా హత్య కేసు ఆధారంగా ఉంటున్నట్లు చెబుతుండటం గమనార్హం.

ఇంద్రాణి గురించి ప్రతి ఒక్క విషయం తెలుసని, అందుకే ఈ సినిమాలో తనకంటే బాగా ఎవరూ నటించలేరని చెప్పింది. ఈ సినిమాకి అవధ్‌ శర్మ నిర్మాత. ఇందులో ఇంద్రాణి పాత్రలో రాఖీ సావంత్ నటిస్తోంది. రాఖీ మాట్లాడుతూ.. ఇంద్రాణి ఎప్పుడు ఒత్తిడితో జీవించలేదన్నారు.

English summary
Rakhi Sawant's upcoming film "Ek Kahaani Julie Ki" is based on the Sheena Bora murder mystery, where she will play the character of prime accused Indrani Mukherjea. The actress and item girl says she was once Indrani's "favourite star".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu