»   » ప్రభాస్ సినిమా నుంచి తొలగించారు.. అందుకే పూరీ ఆఫర్‌ను.. రకుల్ ప్రీత్

ప్రభాస్ సినిమా నుంచి తొలగించారు.. అందుకే పూరీ ఆఫర్‌ను.. రకుల్ ప్రీత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకట్రాది ఎక్స్‌ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకొన్న రకుల్ ప్రీత్ సింగ్ కొద్దికాలంలోనే నిర్మాతలకు నమ్మకమైన హీరోయిన్‌ జాబితాలో చేరింది. వరుస చిత్రాలతో ఈ అందాల సుందరి హవా కొనసాగిస్తున్నది. ఆమె నటించిన చిత్రాలు హిట్‌గా నిలువడంతో టాలీవుడ్‌లోని అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. మెగా హీరోలందరితో జతకట్టింది. ప్రస్తుతం మహేశ్‌బాబుతో డైరెక్టర్ మురుగదాస్ సినిమాలో నటిస్తున్నది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కెరీర్ తొలి రోజులను రకుల్ గుర్తు చేసుకొన్నది.

 ఇప్పటికీ గుర్తొస్తే భయం..

ఇప్పటికీ గుర్తొస్తే భయం..

కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అయినా ధైర్యం కోల్పోకుండా వాటిని ఎదుర్కొన్నాను. చెప్పపెట్టకుండా సినిమాల నుంచి తొలగించిన రోజులు గుర్తొస్తే ఇప్పటికీ భయంగా ఉంటుంది అని రకుల్ అన్నారు.

అవకాశాలు లేక మోడలింగ్ చేశాను..

అవకాశాలు లేక మోడలింగ్ చేశాను..

సినిమాల్లో అవకాశం లభించకపోవడంతో చేతి ఖర్చుల కోసం మోడలింగ్ చేశాను. పలు వ్యాపార ప్రకటనల్లో నటించాను. ఏ అవకాశమొచ్చిన ముందు వెనుకా ఆలోచించలేదు. కన్నడ చిత్రంలో కూడా నటించాను అని రకుల్ చెప్పారు

అందుకే పూరీ సినిమా రిజెక్ట్ చేశాను..

అందుకే పూరీ సినిమా రిజెక్ట్ చేశాను..

చేతిలో సినిమాలు లేని సమయంలో పూరి జగన్నాధ్ చిత్రంలో అవకాశం లభించింది. అయితే అప్పటికీ పరీక్షలు రాస్తున్నాను. చదువు ఆగిపోతుందనే భయంతో పూరి సినిమాను వదులుకొన్నాను. ఆ తర్వాత ఓ చిన్న సినిమాలో నటించాను అని పంజాబీ ముద్దుగుమ్మ వెల్లడించింది.

 నాలుగు రోజుల తర్వాత ప్రభాస్ సినిమా నుంచి..

నాలుగు రోజుల తర్వాత ప్రభాస్ సినిమా నుంచి..

దశరథ్ దర్శకత్వంలో ప్రభాస్ పక్కన మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రంలో నటించేందుకు ఆఫర్ వచ్చింది. నాలుగు రోజులు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత ఆ చిత్రం నుంచి నన్ను తొలగించారు. అయితే ఇప్పటికీ నాకు అంతు పట్టని విషయమేమింటంటే ‘నన్ను ఎందుకు తొలగించారో అర్థం కాదు' అని రకుల్ పేర్కొన్నది.

English summary
Rakul Preet Singh said "I was suffered a lot in early days of Tollywood. For Education sake, I lost Puri Jagannadh's movie offer. After working four days of shooting, I was thrown out of the Prabhas movie without reason."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu