»   » చిరు సందేశాలు ఇస్తే చూడరా, నవ్వుతారా?...ఇలా అనేసేడేంటి?

చిరు సందేశాలు ఇస్తే చూడరా, నవ్వుతారా?...ఇలా అనేసేడేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ: ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సందేశాలు ఇస్తే ప్రేక్షకులు చూడరని చెప్పారు. ఏదో చేస్తానని చిరంజీవి అంటే ప్రేక్షకులు నవ్వుతారేమోనని అభిప్రాయపడ్డాడ.. ఒకప్పుడు చిరంజీవితో ఎన్నో సినిమాలు చేసిన ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి.కృష్ణా జిల్లా విజయవాడలో రోటరీ క్లబ్ సమావేశానికి ఈ దర్శకుడు హాజరయ్య మాట్లాడారు.

అలాగే ఇప్పుడు చిరంజీవి చేస్తున్న సబ్జెక్ట్ ఏంటో తనకు తెలియదని వెల్లడించాడు. మెగాస్టార్ చిరంజీవితో తాను సినిమా చేయాల్సి వస్తే కచ్చితంగా కామెడీ సబ్జెక్టును ఎంచుకుంటానని దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. గతంలో వీరిద్దరి కాంభినేషన్ తెలుగు ప్రేక్షకులకు పలు విజయవంతమైన చిత్రాలు అందించిన విషయం తెలిసిందే. చిరంజీవి కెరీర్ లో చెప్పుకోదగ్గ పెద్ద సూపర్ హిట్ సినిమాలు ఆయనే డైరక్ట్ చేసారు. చిరంజీవితో ఆయన చేసిన ఖైదీ చిత్రం ఎవరూ మరిచిపోరు.

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్వకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న కత్తిలాంటోడు సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం లో రైతు నాయకుడుగా,దొంగ గా చిరంజీవి కనిపించనున్నారు. ఈ చిత్రం సందేశాత్మకంగా సాగనుంది.

దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ - ''సామాన్య రైతు సమస్యల గురించి పోరాడే నాయకుడి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. ఆయన్నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదం, నృత్యాలు, పాటలు, ఫైట్స్, భావోద్వేగాలు.. అన్నీ చిత్రంలో ఉంటాయి. మంచి కథ, మంచి సాంకేతిక నిపుణులు కుదిరారు. ఆగస్టు 12 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరుగుతుంది. త్వరలో టైటిల్ ప్రకటిస్తాం'' అని చెప్పారు.

I will make comedy movies with chiranjeevi

వి.వి.వినాయక్ కంటిన్యూ చేస్తూ.. ఈ సినిమాలో సన్నివేశాలు చిరంజీవి గారి అభిమానులకు కానీ, థియేటర్లో సినిమా చూసే ప్రేక్షకులకు కానీ చాలా ఆనందాన్నిస్తాయి. ముఖ్యంగా ఆయన గ్లామర్ చూసి చాలా ముచ్చటపడిపోతారు. అంత గ్లామర్ గా ఉన్నారు. ఇక సినిమాలో పరిశ్రమలోని ప్రముఖ నటీనటులంతా ఉంటారు. టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకి పని చేస్తారు. చిరంజీవి గారి కొత్త లుక్ తో కూడిన టీజర్ ని కూడా అభిమానుల కోసం త్వరలో రిలీజ్ చేస్తాం.

ఆ తర్వాత చేయబోయే షెడ్యూల్ భారీ షెడ్యూల్ ఉంటుంది. ఈ భారీ షెడ్యూల్లోనే హీరోయిన్ ఎంటర్ అవుతుంది. ఠాగూర్ తర్వాత చిరంజీవి గారితో మళ్లీ చాలా ప్రత్యేకమైన సినిమా చేస్తున్నాను. ఇది ఆయనకు 150వ సినిమా కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళుతున్నాం. ఈ అవకాశం రావడమే చాలా ఆనందంగా ఫీలవుతున్నా.

ఈ కథలో చిరంజీవి గారి నుంచి ప్రేక్షకాభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. కామెడీ, మ్యూజిక్, ఫైట్స్, సెంటిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ ఉంటాయి. సామాన్య రైతుల సమస్య గురించి పోరాడే నాయకుడి పాత్రలో చిరంజీవిగారు నటిస్తున్నారు. ఈ కథని శ్రేయోభిలాషులందరికీ వినిపించడం జరిగింది.

అలాగే చిరంజీవి గారితో పాటు నిర్మాత రామ్ చరణ్, ఫ్యామిలీ సభ్యులందరూ విని ఆనందించారు.వారందరూ ఒకే మాటగా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించడం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది. చిరంజీవి గారు, నేను ఎంత ఆనందంగా ఉన్నామో అంతే ఆనందంగా వారందరూ ఉన్నారు.

ప్రేక్షకులు, అభిమానులు కూడా ఆనందించేలా ఈ సినిమా ఉంటుంది. టైటిల్ ని త్వరలోనే ప్రకటిస్తాం. చరణ్ ఈ సినిమాని భారీగా నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నారు. మంచి కథ, మంచి టెక్నీషియన్లతో సెట్స్ కొచ్చాం. అందుకు తగ్గట్టే సినిమా అద్భుతంగా వస్తుందని ధైర్యంగా చెప్పగలను.... అన్నారు.'

తొమ్మిదేళ్ల తర్వాత మేకప్ వేసుకున్నప్పటికీ, 'చిరంజీవిలో అదే జోష్.. సెట్‌లో అదే సందడి!' అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో మెగాస్టార్ ఎలా కనిపిస్తారోనని ఎదురుచూసిన అభిమానుల కోసం తొలి రోజు చిరంజీవి, అలీ చిత్రీకరణలో పాల్గొన్న ఫోటోలను విడుదల చేశారు.ఇందులో చిరు లుక్ అభిమానులకు కిక్ ఇచ్చే విధంగానే ఉందనాలి.

ఈ చిత్రానికి రచన : పరుచూరి బ్రదర్స్ , కెమెరా: రత్నవేలు, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ , కళ: తోట తరణి, ఎడిటింగ్ : గౌతమ్ రాజు, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Senior Director A.Kodanda Rami Reddy talked about Chiranjeevi and his movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu