»   » మెగాస్టార్ అంటే ఏమిటో నేను చూపిస్తా.. ఆ కసితో ఉన్నా.. ఆ విషయంలో బాలయ్య సూపర్

మెగాస్టార్ అంటే ఏమిటో నేను చూపిస్తా.. ఆ కసితో ఉన్నా.. ఆ విషయంలో బాలయ్య సూపర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవికి నేను ఫ్యాన్‌ని అని పలువురు హీరోలు, దర్శకులు చెప్పుకొంటారు. జీవితంలో ఒక్కసారైనా మెగాస్టార్ నటించాలని హీరోలు కోరుకోవడం తెలిసిందే. ఆయననను ఒక్కసారైనా డైరెక్ట్ చేయాలని డైరెక్టర్లూ తపిస్తుంటారు. ఇటీవల కాలంలో మెగాస్టార్‌ను డైరెక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్న వారిలో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. గతంలో మెగాస్టార్ 150వ చిత్రానికి పూరి డైరెక్టర్ అనే టాక్ వినిపించింది. అయితే ఎందుకో ఆ ప్రయత్నం సఫలం కాలేదు. కానీ ఇటీవల చిరంజీవితో సినిమా చేస్తానని బల్లగుద్ది చెప్పడం గమనార్హం.

ఆటోజానీకి బ్రేక్

ఆటోజానీకి బ్రేక్

టాలీవుడ్‌లో రీ ఎంట్రీలో భాగంగా తన 150వ చిత్రానికి సంబంధించి కథ కోసం చిరంజీవి ఎదురుచూస్తుండగా పూరి జగన్నాథ్ కథ చెప్పాడు. కథలో ఫస్టాఫ్ మెగాస్టార్‌కు బాగా నచ్చింది. సెకండాఫ్ కొంత సందిగ్ధత ఉంది అని పూరి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు చిరంజీవి రీఎంట్రీకి పూరీ దర్శకుడు అని ప్రచారం జరిగింది. ఆ చిత్రానికి టైటిల్ ఆటో జానీ అనేది మీడియాలో నానింది. కానీ అనూహ్యంగా కత్తి రీమేక్‌కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూరీ మరో చిత్రం కోసం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మెగాస్టార్‌తో సినిమా తీస్తా..

మెగాస్టార్‌తో సినిమా తీస్తా..

నా అభిమాన హీరో చిరంజీవితో తప్పకుండా ఓ సినిమా చేస్తా అని ఇటీవల మరోసారి పూరీ జగన్నాథ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆ చిత్రంలో మెగాస్టార్ అంటే ఏమిటో ఆ సినిమాలో చూపిస్తాను. మెగాస్టార్ అసలు నట విశ్వరూపం అనేది ఇదే అనే విధంగా ఉంటుంది అని సవాల్ చేసినంత పనిచేశాడు పూరీ.

చెప్పలేనంత అభిమానం..

చెప్పలేనంత అభిమానం..

ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి అంటే నాకు చెప్పలేనంత అభిమానం. చిన్నతనంలో చిరంజీవి సినిమా చూడ్డానికి క్యూ లైన్లలో నిలబడి టికెట్లు కొనేవాడిని. సినిమా హాళ్ల వద్ద కటౌట్లు కూడా కట్టేవాడిని అని పూరీ చెప్పుకోచ్చాడు

దూరం నుంచి చూసేవాడిని

దూరం నుంచి చూసేవాడిని

దర్శకుడిని కావాలన్న కోరికతో హైదరాబాద్ వచ్చిన సమయంలో చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంటే దూరం నుంచి ఆయనను చూసేవాడిని. చిరంజీవిని అంతగా అభిమానించే తనకు.ఆయనతో ఓ బ్లాక్ బస్టర్ మూవీ తీయాలనే కసి ఉంటుంది కదా అని అభిమానులు ఆనందించే వార్తను జగన్నాథ్ చెప్పారు.

బాలయ్య పంక్చువాలిటీ సూపర్

బాలయ్య పంక్చువాలిటీ సూపర్

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితమే బాలయ్యతో పని చేయాల్సిన అవకాశం వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. షూటింగ్ సమయంలో బాలకృష్ణ సమయపాలన చూస్తే మతిపోతుంది. ఉదయం ఏడు గంటలకు ఫస్ట్ షాట్ అంటే, ఆరున్నరకే ఆయన సెట్ లో ఉంటారు. సినిమాను తెరకెక్కించే తన శైలిని బాలయ్య బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని పూరీ జగన్నాథ్ తెలిపాడు.

English summary
Puri Jagannadh reveals his desire to direct mega star Chiranjeevi. I can project megastar no one like others do sofar in his career, he added. Puri praises Balakrishna punctuality in shooting. Right now Puri directing Balakrishna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu