»   »  నేను శారీరకమైన పాపాలు చేశా, సినిమాలకు దూరం: పాస్టర్‌గా మారిన హీరో రాజా

నేను శారీరకమైన పాపాలు చేశా, సినిమాలకు దూరం: పాస్టర్‌గా మారిన హీరో రాజా

Posted By:
Subscribe to Filmibeat Telugu
నేను శారీరకమైన పాపాలు చేశా, సినిమాలకు దూరం: పాస్టర్‌గా మారిన హీరో రాజా

'ఆనంద్' సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పలు చిత్రాల్లో నటించిన నటుడు రాజా చాలా కాలం క్రితమే సినిమాలకు దూరం అయ్యారు. క్రైస్తవం స్వీకరించిన రాజా ప్రస్తుతం పాస్టర్‌గా కొనసాగుతున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

సినిమా రంగంలో చాలా పాపాలు చేశా

సినిమా రంగంలో చాలా పాపాలు చేశా

సినిమా రంగంలో నేను చేయని పాపం లేదు. శారీరకంగా, మానసికంగా, ఆలోచన పరంగా చాలా పాపాలు చేశాను. బైబిల్‌లో దేవుడు ఒక విషయం చెప్పాడు. మనిషి హృదయంలో ప్రతి ఆలోచన చెడ్డదే. ఆ పరిస్థితుల్లో నేను బ్రతికాను.... అని రాజా తెలిపారు.

నా చెడ్డ పనులు గురించి తెలిస్తే

నా చెడ్డ పనులు గురించి తెలిస్తే

బయటకు చూడటానికి సూటు బూటు వేసుకునే రాజా నిజమైన రాజా కాదు. మీ బాహ్య రూపం నిజమైన రూపం కాదు. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. మన అంతరంగాన్ని చూస్తున్నాడు. మనుషులు బాహ్యరూపాన్ని మాత్రమే చూస్తారు. తెరమీద కానీ, నా ఆలోచనలుకానీ, నేను రహస్యంగా చేసిన చెడ్డ పనులు అన్నీ తెలిస్తే నా ఇంటిలోవారుకానీ, నా భార్య బిడ్డలు కానీ ఎవరూ నా పక్కన ఉండరు. అయినా అలాంటి ఒక వ్యక్తిని క్షమించడానికి ఒక దేవుడు చనిపోయాడంటే, ఆ దేవుడిని నేను ఎందుకు కాదనాలి. నేను చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు... అని రాజా తెలిపారు.

 ఎవరైనా నన్ను వేలెత్తి చూపితే

ఎవరైనా నన్ను వేలెత్తి చూపితే

ఈ రోజు నన్ను ఎవరైనా వేలెత్తి చూపితే.... అవును...నేను ఆ పాపాలు చేశాను అని ఒప్పుకుంటాను. దేవుడు మన శరీరం ఒక ఆలయం అని చెబుతాడు. దాన్ని ఎంతో పవిత్రంగా ఉంచాలి. అవన్నీ నేను చేయలేదు. కానీ దేవుడు దాన్ని సరిదిద్దు కోవడానికి అవకాశం ఇచ్చాడు. తన మరణం ద్వారా, తన రక్త ప్రోక్షణం ద్వారా దేవుడు నాకు అవకాశం కల్పించాడు. ఆ గ్రహింపు నాకు తొందరగా వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజు మీకు కనిపిస్తున్నా రాజా లోన, బయట ఒకటే రాజా. ఇపుడు నేను నటుడిని కాదు. ఇక నేను నటించలేను..... అని రాజా తెలిపారు.

2010లో క్రైస్తవం స్వీకరించాను

2010లో క్రైస్తవం స్వీకరించాను

నేను ఇలా మారడానికి కారణం... 2010లో నా జర్నీ క్రీస్తుతో మొదలైంది. డబ్బును చూశాను, ప్రపంచంలో ఉన్న అనుభవాలన్నింటినీ అనుభవించాను. కానీ సుఖం లేదు. సమాధానం లేదు. సంతోషం లేదు. ఏదో ఒక వెలితి. నేను నటుడిగా కొనసాగి ఉంటే ఈ మార్పు నాలో వచ్చేది కాదు. ఈ రోజు నా భార్య దగ్గర దాచుకున్న రహస్యము ఏదీ లేదు. నేను నా భార్యకు ఒకటే చెప్పాను. ఇది నేను ఒకప్పుడు, నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు అంగీకరిస్తావా? అంటే నీ గతంతో నాకు పని లేదు. నువ్వు కొత్త వ్యక్తిగా కనిపిస్తున్నావు అని చెప్పింది.... అని రాజా తెలిపారు.

ఇక సినిమాల్లో ఎప్పటికీ కనిపించను

ఇక సినిమాల్లో ఎప్పటికీ కనిపించను

ఇక నేను ఎప్పటికీ సినిమాల్లో కనిపించను. గెస్ట్ రోల్స్ కూడా చేసే ఆలోచన లేదు. ఇక జీవితం అంతా ఒకటే రోల్. పాస్టర్‌గా జీవితం మొత్తం నన్ను ఇలాగే చూస్తారు అని రాజా తెలిపారు.

English summary
Tollywood Actor Raja turns as pastor. "I Will Not Act In Movies Anymore" Raja says.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X