»   » కొంత వరకు నిజమే: 'నగ్న' దృశ్యాల గుట్టు విప్పిన సంజన

కొంత వరకు నిజమే: 'నగ్న' దృశ్యాల గుట్టు విప్పిన సంజన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జేమ్స్ బాండ్ సినిమా అయినా కూడా తాను పూర్తి నగ్నంగా నటించడానికి అంగీకరించబోనని నటి సంజన అన్నారు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో దండుపాళ్యం2 సినిమాకు సంబంధించిన ఓ సీన్ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ఓ సీన్‌లో నటి సంజనను నగ్నంగా చిత్రీకరించారని, ఆ వీడియో ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అందులో వాస్తవం లేదని సంజన, ఆ చిత్ర దర్శకుడు చెప్పినప్పటికీ ఆ వీడియో ప్రచారం ఆగడం లేదు. దాంతో హీరోయిన్ సంజన సోషల్ మీడియా వేదికగా అసలు విషయాన్ని బయటపెట్టింది.


తాను కొంత వరకూ అలా నటించిన మాట వాస్తవమేనని, కానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా పూర్తి నగ్నంగా నటించలేదని ఆమె చెప్పింది. ఫేసుబుక్, ట్విట్టర్ వేదికలుగా ఆమె అందుకు సంబంధించిన వివరాలను బయటపెట్టింది.


జేమ్స్ బాండ్ సినిమా అయినా సరే...

జేమ్స్ బాండ్ సినిమా అయినా సరే...

జేమ్స్ బాండ్ సినిమా అయినా సరే తాను వంద శాతం నగ్నంగా నటించడానికి అంగీకరించబోనని సంజన చెప్పింది. నెట్‌లో వైరల్ అవుతున్న వీడియో మార్ఫింగ్ చేసిందని, ఓ నటిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, అదే సమయంలో సంప్రదాయాలను, విలువలను, తన ఆత్మగౌరవాన్ని, స్త్రీ వాదాన్ని గౌరవించాలనే బాధ్యతను కూడా దృష్టిలో ఉంచుకుంటానని చెప్పింది.


Dandupalyam 2 Movie Leaked Scene, Sanjana Hot video
95 శాతం మంది ధరిస్తున్నారు....

95 శాతం మంది ధరిస్తున్నారు....

షూటింగ్ సమయంలో గ్లామరస్‌ షార్ట్ స్కర్ట్, వెస్ట్రన్ బ్యాక్‌లెస్ టాప్‌ను మన దేశంలోని 95 శాతం మంది హీరోయిన్లు వేసుకుంటున్నారని, అంతమంది ముందు అలాంటి దుస్తులు ధరించడం సాహసమేనని, అయినప్పటికీ సినిమాకు మంచి చేస్తోందనే ఉద్దేశంతోనే అలా నటిస్తామని అన్నది.


చంద్రి పాత్ర ఆమెది....

చంద్రి పాత్ర ఆమెది....

దండుపాళ్యం2 సినిమాలో చంద్రి అనే తన పాత్రపై ఎంతో మంది సానుభూతి చూపిస్తున్నారని, కానీ నెట్‌లో వైరల్ అవుతున్న వీడియో చూసి, తనపై సానుభూతి చూపుతున్న విషయం తెలిసి షాకయ్యానని సంజన అన్నది. కేవలం శరీరంపై దుస్తులను మాత్రమే కాదు, మొత్తం వీడియోనే మార్ఫింగ్ చేశారని ఆరోపించింది. ఇది తన వ్యక్తిత్వాన్ని దిగజార్చడమేనని ఇలాంటి పబ్లిసిటీ తన జీవితానికి అవసరం లేదని వ్యాఖ్యానించింది.


సెన్సార్ కట్....

సెన్సార్ కట్....

ఆ సీన్ సినిమాలో ఉందన్న సంగతి తనకు తెలుసునని, అయితే దాన్ని సెన్సార్ బోర్డ్ కట్ చేసిందని సంజన చెప్పింది. సెన్సార్ బోర్డ్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్లు తెలిపింది. కానీ ఈ వీడియోను సోషల్ మీడియాలో నియంత్రించలేని విధంగా ఎవరు వైరల్ చేశారో తనకు తెలియడం లేదని అన్నది. ఈ వీడియో సినిమాకు ఎలాంటి మంచి చేయదని అన్నది.


దాని కోసమే వెళ్లరు...

దాని కోసమే వెళ్లరు...

ఆ దృశ్యం కోసమే ప్రేక్షకులు సినిమా చూడడానికి వెళ్లరని సంజన చెప్పిది. సినిమా కథ నచ్చితే వెళతారని సినిమాలో ఈ సీన్ లేదని స్పష్టం చేసింది. ఇలాంటి సంక్లిష్టమైన సమయంలో తనకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. అందరికీ తనదో అభ్యర్థన అంటూ అందరూ దయచేసి మీ సోషల్ మీడియాలో ఈ వీడియో ఉంటే తొలగించగలరని ఆశిస్తున్నాన అన్నది.English summary
Actress Sanjana clarified on her nude acting in Dandupalyam 2film.She urged to delilte the nude video from social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu