»   » సిద్ధార్థ్‌తోనే.. నాకు అలా చేయాలని ఉంది.. ఎవరూ రావడం లేదు!

సిద్ధార్థ్‌తోనే.. నాకు అలా చేయాలని ఉంది.. ఎవరూ రావడం లేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కహానీ, కహానీ2, డర్టీ పిక్చర్ లాంటి చిత్రాలతో విలక్షణ నటిగా పేరు సంపాదించిన విద్యాబాలన్ తీరని కోరిక ఒకటి వెంటాడుతున్నదట. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే కాకుండా హీరోతో చెంగు చెంగున ఎగిరి గంతేసే డ్యాన్స్ చేసే పాత్రలను చేయాలని ఉన్నదని, కానీ అలాంటి పాత్రలతో ఎవరూ రావడం లేదని విద్యాబాలన్ తెలిపారు.

Udi Udi kaha kaha, kaha main Udi Udi Ittefaq Se!! 😜🤣

A post shared by Vidya Balan (@balanvidya) on Feb 15, 2017 at 3:08am PST

నాకు డ్యాన్స్ చేయాలని ఉంది..

నాకు డ్యాన్స్ చేయాలని ఉంది..

తనకు డ్యాన్స్ చేయాలని ఉన్నదని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ చిన్న వీడియోను పోస్ట్ చేసింది. చాలా ఫన్నీగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం పలువురిని అమితంగా ఆకట్టుకొంటున్నది.

ఆ పాత్రలు సంతోషం కలిగించడం లేదు..

ఆ పాత్రలు సంతోషం కలిగించడం లేదు..

కొన్ని సినిమాల్లో పాటలు, డాన్స్ ఉన్న సన్నివేశాల్లో నటించాను. కానీ నాకు అది సంతోషం కలిగించడం లేదు. డ్యాన్స్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించాలని ఉంది. అయితే నాకు నృత్యంలో అంతగా ప్రవేశం లేదు. ఫ్రీ స్టయిల్ డ్యాన్సింగ్ లాంటివి చేయాలని ఉంది అని తెలిపారు.

 సిద్ధార్థ్‌తోనే ఎక్కువగా

సిద్ధార్థ్‌తోనే ఎక్కువగా

‘తీరిక వేళల్లో ఎక్కువగా నిద్రపోతుంటాను. నా భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో సమయాన్ని గడుపుతాను. పుస్తక పఠనం అంటే పెద్దగా ఇంట్రస్ట్ ఉండదు. బాగా తింటాను. దానికి తగినట్టు ఎక్సర్ సైజ్ చేస్తాను. సంగీతం వింటాను అని విద్యాబాలన్ చెప్పారు.

2016లో మూడు చిత్రాలతో బిజీబిజీ

2016లో మూడు చిత్రాలతో బిజీబిజీ

తన కెరీర్ లో గతంలో లేని విధంగా విద్యాబాలన్ 2016లో బిజీబిజీగా ఉన్నది. తుమ్హారీ సులు, బేగం జాన్, కహానీ2 చిత్రాల్లో నటించింది. ఒకే ఏడాది మూడు చిత్రాల్లో నటించడం మొదటిసారి అని తెలిపింది.

English summary
Actress Vidya balan says, I would love to do a dancing role. But, no one offers it to me.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu