»   » పాక్ ఐఎస్ఐ చీఫ్‌తో బాలీవుడ్ స్టార్‌కు సంబంధం, దేశమే గొప్ప అంటూ..!

పాక్ ఐఎస్ఐ చీఫ్‌తో బాలీవుడ్ స్టార్‌కు సంబంధం, దేశమే గొప్ప అంటూ..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించిన కబీర్ ఖాన్ సినిమా ‘ఫాంటమ్'. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. దాడులు వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ను మట్టుపెట్టే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో సైఫ్ నటించాడు. ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది.

ఈ సినిమాపై ఇప్పటికే పాకిస్థాన్ లో నిషేదం విధించారు. తాజాగా సినిమా ప్రమోషన్లో సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలన సృష్టించాయి. పాకిస్తాన్ లో ఈ సినిమాపై నిషేదం విధించిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ... జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయ్యద్ ముంబై టెర్రరిస్టు దాడుల వెనక అసలు సూత్రధారి అని పేర్కొనడం గమనార్హం. సైఫ్ వ్యాఖ్యలతో ఇంటర్నేషనల్ మీడియాకు షాకైంది.

 Saif Ali Khan

అంతే కాకుండా....2012 లో ఐఎస్ఐ చీఫ్ గా పనిచేసిన మేజర్ జనరల్ అలీఖాన్ తనకు అంకుల్ అవుతారని, చిన్నతనంలో ఆయన పిల్లలతో కలిసి ఆడుకున్నట్లు తెలిపారు. దేశం కన్నా తనకు ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ కాదని, భారత దేశానికి హాని చేసేవారు తన కుటుంబసభ్యులైన వారికి మద్ధతు తెలిపే ప్రసక్తే లేదంటూ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం పాక్ విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న షేర్యార్ ఖాన్ కూడా తన బంధు వర్గం వాడే అన్న సైఫ్, భారత ప్రభుత్వంతో ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయిని తెలిపారు.

ఉన్నట్టుండి సైఫ్ ఈ విషయాలు మాట్లాడటం వెనక పబ్లిసిటీ గిమిక్స్ ఉన్నాయని, తాను నటించిన ‘ఫాంటమ్' సినిమాకు పబ్లిసిటీ పెంచేందుకే ఆయన ఈ విషయాలు ఇపుడు వెలుగులోకి తెచ్చారని అంటున్నారు. మరి ఈ వివాదాలు సైఫ్ సినిమాకు ఏ మేరకు సహకరిస్తాయో చూడాలి.

English summary
'I would still choose my country over any relative', Saif Ali Khan ponders his loyalties as new spy film Phantom is banned in Pakistan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu