twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "నేను హీరోని కాను" చెప్పిన జూనియర్... తారక్ ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు

    |

    తెలుగు సినిమా అంటే హీరో ల వన్మ్యాన్ షో అన్న అభిప్రాయం మారే రోజులొచ్చినట్టేనా? గత కొన్ని సంవత్సరాలు గా కథని బట్టి హీరో కాక హీరో కోసమే కథలు రావటం మొదలయ్యింది. "హీరో గారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు" కథలు కూడా రాసే పరిస్థితి వచ్చాక హీరోల మీద కూడా విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఒకరకంగా ఈ దోరణి హీరోల రెమ్యునరేషన్లు భారీగా పెరగటానికి కారణం కూడా.

    కథ నే హీరో అనే మాట అప్పుడప్పుడు వినబడ్డా అది ఏచిన్న సినిమాల విషయం లో తప్ప స్టార్ హీరోలు మాత్రం ఎప్పుడూ తామే సినిమా అన్నట్టు ఉండిపోయారు. దానికి తగ్గట్టే అభిమానులూ మారిపోయారు. అయితే ఇన్నాళ్ళకి ఒక స్టార్ హీరో ఈ మాట చెప్పాడు ఐతే ఎన్టీఆర్ ఈ మాటే నొక్కి వక్కాణిస్తున్నాడు. తాను ఇందులో హీరో కాదు అని. అలాగని మోహన్ లాల్ కూడా ఇందులో హీరో కాదట.

    అసలు ఇందులో ఏ నటుడూ హీరో కాదట. జనతా గ్యారేజే ఇందులో హీరో అని.. తామందరం ఆ హీరోకు సహకారం మాత్రమే అందించామని ఎన్టీఆర్ చెప్పాడు. "జనతా గ్యారేజ్ లో హీరో నేనూ కాదు.., మోహన్ లాల్ గారూ కాదు "జనతా గ్యారేజే" ఇక్కడ హీరో. మేమంతా కేవలం నటులమే అంటూ తారక్ చెప్పిన మాట చాలా మందికి నచ్చింది... అంతే కాదు... తారక్ కి ఈగో అనే వాళ్ళకీ ఒక అద్బుతమైన మాటతో షాక్ ఇచ్చాడు మన జూనియర్.... ఇంతకీ యంగ్ టైగర్ ఏమన్న్నాడంటే....

    హీరో కాదట

    హీరో కాదట

    జనతా గ్యారేజ్‌లో హీరో ఎన్టీఆర్ కాదట ఈ మాటన్నది ఎవరో కాదు. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు.

    మోహన్‌లాల్ కూడా కాదు

    మోహన్‌లాల్ కూడా కాదు

    సినిమాలో తాను హీరో కాదని, అలా అని సీనియర్ నటుడు మోహన్‌లాల్ కూడా కాదనీ చెప్పి. మొత్తంగా ‘జనతా గ్యారేజ్' ఓ హీరో అని.., తామంతా ‘హీరో'కు మద్దతు ఇచ్చే సపోర్టింగ్ యాక్టర్లమే అనీ అన్నాడు.

    జనతా గ్యారేజే

    జనతా గ్యారేజే

    జనతా గ్యారేజ్ చుట్టూనే కథ సాగుతుంది. కాబట్టి ఇందులో నేను గానీ, మోహన్‌లాల్ గారు గానీ హీరోలం కాం. జనతా గ్యారేజే హీరో కథే

    కొరటాల శివ వల్లే

    కొరటాల శివ వల్లే

    ఈ కథే నన్ను, మోహన్‌లాల్, ఇతర నటులను ఎంచుకుంది. ఇంత గొప్ప నటులు, టెక్నీషియన్లు సమకూరడానికి కారణం ఆ స్క్రిప్టే. కొరటాల శివ వల్లే అందరం ఒక్కటయ్యాం" అని తారక్ చెప్పుకొచ్చాడు.

    ఒక షాక్ ఇచ్చాడు

    ఒక షాక్ ఇచ్చాడు

    అంతే కాదు ఇప్పటివరకూ తెలుగు హీరోలకు ఈగో ప్రాబ్లెం అనుకునే వాళ్ళకీ ఒక షాక్ ఇచ్చాడు. నటుడిగా మోహన్‌లాల్ గురించి మాట్లాడే స్థాయి తనది కాదని, ఆ కోణంలో మాట్లాడితే ఆయన్ను కించపరిచినట్టే అవుతుందని అన్నాడు.

    చాలా మంచి మనిషి

    చాలా మంచి మనిషి

    ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడితే.. ఆయనో చాలా మంచి మనిషి అని చెప్పాడు. తనకు ఓ చిన్న కుర్చీ వేసినా సంతృప్తి పడిపోయే మనస్తత్వం ఆయనదని..,దేనిపైనా అసంతృప్తి చూపించని ఆయన తనకెంతో నేర్చుకునే అవకాశం ఇచ్చాడు అన్న అర్థం వచ్చేలా చెప్పాడు. .

    ఆశ్చర్యం

    ఆశ్చర్యం

    ఆ స్థాయి వ్యక్తి అంత సింపుల్‌గా ఉండడం ఆశ్చర్యం కలిగించే అంశమనీ. తినే తిండి దగ్గర్నుంచి, నటన వరకు ప్రతి విషయంలోనూ ఆయనసంతోషం వెతుక్కుంటారని చెప్పుకొచ్చాడు. ఆయన్నుంచి తాను అదే నేర్చుకున్నానని చెప్పిన జూనియర్.

    తన గౌరవాన్నీ చాటుకున్నాడు

    తన గౌరవాన్నీ చాటుకున్నాడు

    అలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయడం అదృష్టమని, ఇలాంటి అవకాశం కల్పించినందుకు కొరటాల శివకు నేను కృతఙ్ఞుడిని చెప్పి తన వినయాన్నీ, పెద్ద నటుల పట్ల తన గౌరవాన్నీ చాటుకున్నాడు.

    English summary
    NTR said he is not the Hero in Janatha Garage.. the storry of the movie it self a Hero
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X