HBD Allu Arjun: చిన్నప్పుడే రెండు హిట్లు.. గంగోత్రికి ముందే మూడు.. బన్నీకి మాత్రమే దక్కిన రికార్డు

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. చాలా తక్కువ సమయంలోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు.

అదే సమయంలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇటీవలే బన్నీ 'పుష్ప' మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా అతడి జీవితంలోని బెస్ట్ మూమెంట్స్‌ గురించి తెలుసుకుందాం పదండి!

చిన్నప్పుడే రెండు విజయాలు

చిన్నప్పుడే రెండు విజయాలు

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'విజేత' అనే సినిమాతో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన 'స్వాతి ముత్యం' సినిమాలోనూ నటించాడు. ఇలా చిన్నప్పుడే రెండు భారీ విజయాలను దక్కించుకున్నాడు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన 'డాడీ'లో అత్యంత ముఖ్యమైన పాత్రను చేశాడు.

అలా పరిచయం.. స్టైలిష్ స్టార్

అలా పరిచయం.. స్టైలిష్ స్టార్

రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'గంగోత్రి'తో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ వెంటనే సుకుమార్ చేసిన 'ఆర్య'తో స్టైలిష్ స్టార్ బిరుదును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తూ ఎన్నో విజయాలను అందుకున్నాడు. తద్వారా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అంతేకాదు, అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.

హిట్లు ఫ్లాపులతో దూసుకెళ్తూనే

హిట్లు ఫ్లాపులతో దూసుకెళ్తూనే

హీరోగా అల్లు అర్జున్ కెరీర్ గ్రాండ్‌గా మొదలైంది. అలా వరుసగా హ్యాట్రిక్ నమోదు చేసిన అతడు.. 'దేశముదురు'తో భారీ హిట్ కొట్టాడు. 'జులాయి', 'రేసుగుర్రం', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సరైనోడు', 'అల.. వైకుంఠపురములో' వంటి హిట్లు కొట్టాడు. అలాగే, 'వరుడు', 'బద్రీనాథ్', 'హ్యాపీ', 'ఇద్దరమ్మాయిలతో', 'నా పేరు సూర్య' వంటి ఫ్లాపులు చూశాడు.

ప్రేమ వివాహం.. ఫ్యామిలీతోనే

ప్రేమ వివాహం.. ఫ్యామిలీతోనే

సినిమా పరంగా పుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే అల్లు అర్జున్.. స్నేహారెడ్డితో ప్రేమాయణం సాగించాడు. ఈ క్రమంలోనే 2011లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక, ఈ జంటకు అయాన్, అర్హా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. షూటింగ్ లేని సమయాల్లో బన్నీ ఎక్కువగా కుటుంబంతోనే సమయాన్ని గడుపుతాడు. ఇందులో భాగంగానే హాలీడే ట్రిప్‌లు సైతం ప్లాన్ చేస్తుంటాడు.

పుష్పతో పాన్ ఇండియా స్టార్

పుష్పతో పాన్ ఇండియా స్టార్

గత ఏడాది అల్లు అర్జున్ 'పుష్ప' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. అంతేకాదు, రిలీజైన అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా బన్నీని ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్‌ను చేసింది. ఇక, ఇప్పుడు దీని సీక్వెల్‌పైనే ఈ అల్లు హీరో ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు.

 ఆ రెండు చిత్రాలు.. ఆగాయా

ఆ రెండు చిత్రాలు.. ఆగాయా

అల్లు అర్జున్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే, దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడిన తర్వాత ఇది ఆగిపోయింది. దీంతో వీళ్లిద్దరూ వేరే వేరు ప్రాజెక్టులు చేస్తున్నారు. అలాగే, బన్నీ.. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో 'ఐకాన్' అనే సినిమాను కూడా చేయాల్సి ఉంది. కానీ, ఇది కూడా ఎందుకనో ఆగిపోయింది.

బన్నీకి మాత్రమే దక్కిన రికార్డ్

బన్నీకి మాత్రమే దక్కిన రికార్డ్

సుదీర్ఘమైన కెరీర్‌లో అల్లు అర్జున్ ఎన్నో అవార్డులను అందుకున్నాడు. కేరళలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నాడు. తన డబ్బింగ్ సినిమాలతో హిందీ ప్రేక్షకులకు చేరువై యూట్యూబ్‌లో ఎక్కువ వ్యూస్ అందుకుని రికార్డులకెక్కాడు. బాలీవుడ్ కంటే ముందే సిక్స్ ప్యాక్ చేసి ఔరా అనిపించాడు. ఇలా ఎన్నో రికార్డులను దక్కించుకున్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. ఇప్పుడు పాన్ ఇండియాపై దండయాత్ర చేస్తూ తగ్గేదేలే అంటోన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X