»   » మిస్టేక్స్: మాజీ లవర్‌ను కొంగుతో కొట్టిన నయనతార (వీడియో)

మిస్టేక్స్: మాజీ లవర్‌ను కొంగుతో కొట్టిన నయనతార (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మాజీ ప్రేమికులైన నయనతార, శింబు చాలా కాలం తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తమ మధ్య ఉన్న సంబంధం పాత జ్ఞాపకాలను పూర్తిగా మరిచిపోయిన ఈ స్టార్స్.......స్నేహితులుగా కొత్త జీవితం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఇద్దరూ పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇదు నమ్మ ఆలు' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

 Idhu Namma Aalu Bloopers

ఇద్దరూ ఫాంలో ఉన్న స్టార్స్ కావడం....పైగా మాజీ లవర్స్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో ఇద్దరూ రియల్ లైఫ్ ప్రేమలో ఉన్నపుడు తెరపై రొమాన్స్ బాగా పండించేవారు. రెచ్చిపోయి హాట్ హాట్ సీన్లలో నటించే వారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు.

షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని మిస్టేక్స్ సీన్స్ అన్ని జత చేసి బ్లూపర్స్ పేరుతో ఓ ట్రైలర్ విడుదల చేసారు. ఇందులో నయనతార, శింబు షూటింగ్ సమయంలో నవ్వుల్లో మునిగితేలిన సన్నివేశాలు ప్రేక్షకలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఓ సందర్భంలో నయనతార తన కొంగుతో కొట్టడం గమనార్హం.

గతంలో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉన్న సమయంలో కూడా ఇద్దరి మధ్య ఇంత క్లోజ్ నెస్ లేదని, ఇపుడు మాత్రం షూటింగ్ సమయంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారని, ఇద్దరి మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని, ముఖ్యంగా రొమాంటిక్ సీన్లు ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంటున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
Watch the Bloopers of Director Pandiraj’s Idhu Namma Aalu starring STR, Nayanthara, Soori and Andrea in lead roles. Music composed by Kural TR, the younger brother of STR and produced by Chimbu Cine Arts & Pasanga Productions.
Please Wait while comments are loading...