»   » నయనతార-శింబు పెళ్లి ఫోటో....హాట్ టాపిక్

నయనతార-శింబు పెళ్లి ఫోటో....హాట్ టాపిక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మాజీ ప్రేమికులైన నయనతార, శింబు చాలా కాలం తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తమ మధ్య ఉన్న సంబంధం పాత జ్ఞాపకాలను పూర్తిగా మరిచిపోయిన ఈ స్టార్స్.......స్నేహితులుగా కొత్త జీవితం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఇద్దరూ పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇదు నమ్మ ఆలు' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది.

సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తవడంతో... మూవీ స్టిల్స్ ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తున్నాయి. సినిమాలోని నయన్ శింబు పెళ్లి ఫోటోను పోస్టర్ గా విడుదల చేయడంతో.. దీనిపై తమిళ సినీ వర్గాలతో పాటు ఆడియన్స్ లోనూ హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. కొందరు ఈ పోస్టర్ ను లైట్ తీసుకుంటుంటే మరికొందరు మాత్రం శింబు నయన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారా అని ఆరా తీయడం మొదలుపెట్టారట.

Idhu Namma Aalu First look Posters

రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రచారానికి ఈ పోస్టర్ ఒక్కటి సరిపోతుందని భావించిన చిత్ర దర్శకనిర్మాతలు.. సరిగ్గా ఇదే స్టిల్ ను సినిమా ఫస్ట్ లుక్ గా విడుదల చేశారట. వారు అనుకున్నట్టే సినిమాపై మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తుండటంతో.. నయన్ శింబు కాంబినేషన్ లోని మరిన్ని రొమాంటిక్ స్టిల్స్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇద్దరూ ఫాంలో ఉన్న స్టార్స్ కావడం....పైగా మాజీ లవర్స్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో ఇద్దరూ రియల్ లైఫ్ ప్రేమలో ఉన్నపుడు తెరపై రొమాన్స్ బాగా పండించేవారు. రెచ్చిపోయి హాట్ హాట్ సీన్లలో నటించే వారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు.

గతంలో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉన్న సమయంలో కూడా ఇద్దరి మధ్య ఇంత క్లోజ్ నెస్ లేదని, ఇపుడు మాత్రం షూటింగ్ సమయంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారని, ఇద్దరి మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని, ముఖ్యంగా రొమాంటిక్ సీన్లు ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంటున్నారు.

English summary
Here is the first look of Simbu-Nayantara’s ‘Idhu Namma Aalu’, directed by Pandiraj. The first look has grabbed eyeballs as soon as it was released online.
Please Wait while comments are loading...