»   » నన్ను వ్యభిచారి అన్నా ఫర్వాలేదు: హీరోయిన్ సంచలన కామెంట్

నన్ను వ్యభిచారి అన్నా ఫర్వాలేదు: హీరోయిన్ సంచలన కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూఢిల్లీ: ఓ వైపు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సంతోషం... మరో వైపు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో వివాదం కారణంగా కోర్టు కేసులను ఎదుర్కొంటున్న కంగనా రనౌత్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసారు.

జాతీయ నటిగా అవార్డు అందుకున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా స్పందిస్తూ...'ఒక మహిళ సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉంటే ఆమెను ఆమెను ఈ సమాజంలో వేశ్యగా భావిస్తారు. అదే మహిళ ఏదైనా రంగంలో సక్సెస్ సాధిస్తే సైకో అని ముద్రవేస్తారు. ఈ రెండింటిలో నన్ను ఏదనుకున్నా ఫరవాలేదు. ఎందుకంటే నేను ఎవరి కోసం బతికేదాన్ని కాదు.. నా కోసం నాకు నచ్చినట్టు జీవించేదాన్ని' అంటూ తనపై వస్తున్న ఆరోపణలకు తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది.

తనపై వచ్చే విమర్శలకు సక్సెస్‌తోనే సమాధానమిస్తానంటున్న కంగనా ఆడవాళ్ళను ఈ సమాజంలో ఇంకా వస్తువులుగానే చూస్తుండటం దారుణమైన విషయంగా ఆమె పేర్కొన్నారు. ఒక అమ్మాయి చనిపోవాలనుకుంటే ఆత్మహత్యే చేసుకోనవసరం లేదు..ఆమె సాధించే విజయాలు, ఎదురయ్యే విమర్శలే ఆమెను చంపుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ చీకటి రోజులు ఉంటాయి...కానీ ఎప్పటికైనా వెలుగులోకి వస్తామనేది నా నమ్మకం అని పేర్కొన్నారు.

కంగనా రనౌత్ ఇంటర్వ్యూలో చెప్పిన మరిన్ని విశేషాలు, హృతిక్ తో వివాదం గురించి ఎలా స్పందించారు? అనే విషయాలు స్లైడ్ షోలో...

హృతిక్ తో వివాదంపై

హృతిక్ తో వివాదంపై

హృతిక్ రోషన్ వివాదాన్ని న్యాయపరంగానే ఎదుర్కుంటానని, నేను వెళ్ళే దారి సరైనదే కాబట్టి అలానే ముందుకు వెళతానని కంగనా తేల్చి చెప్పింది.

నా కోసం నేను

నా కోసం నేను

నా కోసం నేను బ్రతుకుతాను... ఇతరుల కోసం కాదు అని కంగనా రనౌత్ తేల్చి చెప్పింది.

గర్విస్తున్నా

గర్విస్తున్నా

నా పెలుసైన శరీరం...షార్ప్ మైండ్ చూసి గర్విస్తున్నాను అంటూ కంగనా చెప్పింది.

అద్భుతంగా సాగింది

అద్భుతంగా సాగింది

ఒక చిన్న గ్రామం నుండి మొదలైన నా ప్రయాణం ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా సాగిందని కంగనా చెప్పుకొచ్చింది.

English summary
"If a woman is sexually active, she's called a whore" and if she's "super-successful, she's called a psychopath" Kangana Ranaut Said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu