»   »  ఓటు కోసం డుమ్మా కొడుతున్న హీరోయిన్

ఓటు కోసం డుమ్మా కొడుతున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఓటు వేయడం ఎంత ముఖ్యమైన అంశమో తెలియజేసే ప్రయత్నం చేస్తోంది బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్. ఓటు విషయమై ఆమె మాట్లాడుతూ....ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డులకు నాకు ఆహ్వానందం అందిందని, అయితే అదే సమయంలో ఎలక్షన్ ఉండటం వలను తాను ఆ కార్యక్రమానికి వెళ్లడం లేదని, ఏప్రిల్ 24వ తేదీన ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే తాను ఆ అవార్డుల కార్యక్రమానికి గైర్హాజరవుతున్నట్లు తెలిపింది.

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం ఫ్లోరిడాలోని టంపా బేలో ఈ నెల 23 నుండి 26 వరకు జరుగనుంది. ముంబై 24వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ముంబైలో ఉండే చాలా మంది సినిమా స్టార్లు ఓటు వేయడాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా అవార్డుల కార్యక్రమానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

If you don't vote, you don't have the right to complain: Soha Ali Khan

కానీ సోహా అలీ ఖాన్ మాత్రం....మిగతా స్టార్లు భిన్నంగా ఓటు వేయడం కోసం ఆ అవార్డుల కార్యక్రమానికి డుమ్మా కొట్టాలని నిర్ణయించుకుంది. అయితే ఓటు వేయకుండా డుమ్మా కొడుతున్న ఇతర స్టార్ల గురించి మాట్లాడటానికి సోహా అలీ ఖాన్ నిరాకరించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అసరం ఉందని వ్యాఖ్యానించారు.

యువత రాజకీయాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, దేశానికి మంచి నాయకత్వం రావాలంటే ప్రతి ఒక్కరికి రాజకీయాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని, మంచి భవిష్యత్ కోసం మంచి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించాలని సోహా అలీ ఖాన్ కోరుతోంది. ఓటే వేయనప్పుడు ప్రశ్నించే హక్కు ఉండదని ఆమె వ్యాఖ్యానించారు.

English summary
Actress Soha Ali Khan, who is spreading awareness about voting, says if you don't vote, you don't have the right to complain.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu