»   » వర్మ v/sనాగబాబు : వరుణ్ తేజ్ ! నువ్వు మీనాన్నని నమ్మకు అంటూ సలహా ఇచ్చాడు

వర్మ v/sనాగబాబు : వరుణ్ తేజ్ ! నువ్వు మీనాన్నని నమ్మకు అంటూ సలహా ఇచ్చాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన ఎక్స్‌ప్లోసివ్‌ స్పీచ్‌తో యండమూరి వీరేంద్రనాధ్‌, రాంగోపాల్‌వర్మని ఒకేసారి టార్గెట్‌ చేసి మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యాడు. ఇక వేడుకలో ఇదే హాట్‌ టాపిక్‌ అవడంతో నాగబాబు స్పీచ్‌నే మీడియా దంచి కొట్టింది. రాంగోపాల్‌వర్మ ఎలాగో ట్వీట్ల పర్వం సాగిస్తూ అదే ఎపిసోడ్ ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకో సంగతి ఉంది ఒక వేళ నాగ బాబు ఈ కాంట్రవర్సీని గనక రేపకపోయి ఉంటే మీడియా, జనం దృష్టి అంతా పవన్ కళ్యాణ్ మీదే ఉండేది.

పవన్ ఎందుకు రాలేదు అన్న విషయమే ఇక్కడ హైలెట్ అయి ఉండేది. అయితే నాగబాబు స్పీచ్ తో అసలు పవన్ ఈ సభకు రాకపోవటం అనేది చాలా అంటే చాలా చిన్న న్యూస్ అయిపోయింది. ఒకరకంగా ఈ కాంట్రవర్సీ వల్ల లాభమే జరిగిందనుకోవాలి లేదంటే మళ్ళీ అన్న దమ్ముల మధ్య వచ్చిన గ్యాప్ గురించే మాట్లాడుకునే వాళ్ళు అందరూ.... ఇది పథకం ప్రకారం జరిగిందా లేక నాగబాబే ఈ మెగా స్కెచ్‌ ఇంత పక్కాగా అమలు చేసాడా అన్నది పక్కన పెడితే పవన్‌ మీద నుంచి ఫోకస్‌ తప్పించడంలో నాగబాబు ఫుల్‌గా సక్సెస్‌ అయ్యాడు. మీడియా కూడా ట్రాప్‌లో పడిపోయి ఒక హాట్‌ టాపిక్‌ని గుర్తించి సెన్సేషనలైజ్‌ చేయడంలో పెద్ద ఆసక్తి చూపించలేదు.

If you follow your father's Advise you might be become unjabardast as him

ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు ఆర్జీవిని కెలకటం మాత్రం నిప్పులో ఉప్పు వేసినట్టయ్యింది. అసలే ట్విటర్ లోనే ఓ గెస్ట్ హౌస్ ఉన్నట్టు సగం రోజంతా అక్కడే ఉండే వర్మ... ఇప్పుడు ఏకంగా అదే తన ఇళ్ళు అన్నట్టు తయారయ్యాడు. వరుస ట్వీట్లతో నాగబాబు ని ఏసుకుంటున్నాడు. నిన్నటిదాకా నాగ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను కలుపుకుంటూ సెటర్లు వేసిన వర్మ నాగ బాబు స్పందించక పోవటం తో ఇక ఇప్పుడు చూపు నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌పై పడింది.

'ఖైదీ నంబర్‌ 150' చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో నాగబాబు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఇటీవల విరుచుకుపడ్డ వర్మ.. ఇప్పుడు తండ్రిని అనుసరించొద్దంటూ వరుణ్‌కి సలహా ఇస్తునాడు. 'వరుణ్‌తేజ్‌ నువ్వు మీ నాన్న సలహాలు వింటే ఆయనలాగే జబర్దస్త్‌ లేకుండా తయారవుతావు.. చిరంజీవి గారి నుంచి నేర్చుకో. హే వరుణ్‌.. నీకు తెలుసు నీ సామర్థ్యాన్ని నేను ఎంతగా ఇష్టపడుతానో. దయచేసి చిరంజీవిగారిలా మీ తండ్రిని నమ్మి పొరపాటు చేయొద్దు.. లవ్యూ' అని వర్మ ట్వీట్‌ చేశాడు. మళీ అంతలోనే ఏమైందో గానీ.

If you follow your father's Advise you might be become unjabardast as him

అక్కడితో ఆగటం లేదు రానా తన వాల్ మీద ఖైదీ నెం 150 సక్సెస్ కోరుకుంటున్నాను అని చేసిన పోస్ట్ ని కూడా షేర్ చేసుకొని "ఔను నేనూ ఇదే కోరుకుంటున్న (ఖైదీ నెం 150 సక్సెస్ కావాలని) టీజర్ ఎక్స్లెంట్ గా ఉంది కదా అంటూ కూడా ఇంకో పోస్ట్ పెట్టాడు. అయితే ఈ ట్వీట్ కింద ఉన్న కామెంట్స్ మరింత వ్యంగ్యంగా ఉంటున్నాయి. కొందరు వర్మని ఉద్దేషించి తిడితే మరికొందరు పవన్ ని టార్గెట్ చేసికూడా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు....

English summary
If you follow your father's Advise you might be become unjabardast as him.. Varma tweet for Varun tej
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu