For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Home

  By Staff
  |

  ఇంటర్వ్యూ

  Wednesday, September 22 2004

  గతఎన్నికల్లో రంగంలోని ప్రముఖులంతాబహిరంగంగా టిడిపికి మద్దతుపలికినప్పుడు ఆయన మొక్కవోనినిబ్బరంతో కాంగ్రెస్‌ పక్షాన నిలిచారు.ఇదే విలక్షణత ఆయన నటనలోనూఉంటుంది. మూడు వందలకు పైగా ల్లోనటించిన ధర్మవరపుసుబ్రమణ్యం యాభై ఒకటో పుట్టిన రోజుసందర్భంగా ఇంటర్వూ.

  ఈసారి మీపుట్టినరోజుకు ఏదైనా ప్రత్యేకత ఉందా?
  తప్పకుండాప్రత్యేకత ఉంది. ఎందుకంటే 51 వపుట్టినరోజునాటికి సుమంత్‌ 51చిత్రంలో నటిస్తున్నాను.

  ప్రస్తుతంఎన్ని చిత్రాల్లో చేస్తున్నారు?
  51 కాకుండామిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజా కృష్ణమూర్తి,అవునన్నా కాదన్నా, ధైర్యం,లీలామహల్‌ సెంటర్‌ చిత్రాల్లో నటిస్తున్నాను.

  కాలేజిప్రిన్సిపాల్‌ పాత్రల్లో ఎక్కువగా నటించేమీరు ల్లోకి రాకముందుఏంచేసేవారు?
  నిజ జీవితంలో ప్రిన్సిపాల్‌ని కాను. పంచాయితీ రాజ్‌ శాఖలోఉద్యోగం చేసేవాడిని.

  మీల్లో మీకు బాగా నచ్చిన చిత్రమేది?
  తేజడైరెక్టు చేసిన ఫ్యామిలీ సర్కస్‌

  మీ మొదటిపారితోషికం ఎంత?
  నా మొదటి జయమ్ము నిశ్చయమ్మురాకుఏడు వేల ఐదు వందల రూపాయలుపుచ్చుకున్నాను.

  మీఅభిమాన హాస్యనటులెవరు?
  తోటిహాస్యనటులందరినీ అభిమానిస్తాను. నా దృష్టిలోమంచి హాస్యనటుడు బ్రహ్మానందం.ఆయన క్లాస్‌ నుంచి మాస్‌ వరకుపరిపూర్ణంగా హాస్యం పండించగలడు.

  మిమ్మల్ని రంగానికి ప్రోత్సహించింది ఎవరు?
  జంధ్యాలగారు. ఆనందో బ్రహ్మ సీరియల్‌ చూసిఆయన నాకు జయమ్ము నిశ్చయమ్మురాలో అవకాశంకల్పించారు. మేమిద్దరం కలిసి పది లుచేశాం.

  మీరుమొదట టీవీ ఆర్టిస్టు కదా? టీవీకీ కువ్యత్యాసమేమిటి?
  టీవీ అయితేప్రేక్షకుల వద్దకు మేమే వెళ్తాం. అయితే మావద్దకుప్రేక్షకులను రప్పించుకుంటాం.

  రాష్ట్రంలోకాంగ్రెస్‌ తరఫున గత ఎన్నికల్లో ప్రచారంచేశారు కదా? భవిష్యత్తులోఎమ్మెల్యే అయ్యే ఆలోచన ఉందా?
  మొన్నజరిగిన ఎన్నికల్లోనే గుంటూరు నుంచిఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామన్నారు. రంగానికి ఇప్పుడే దూరం కావడంఇష్టం లేక వద్దన్నాను. భవిష్యత్తులోఏం జరుగుతుందో చెప్పలేను.

  ఒకహాస్యనటుడుడిగా మీరిచ్చే సందేశం?
  జీవితంలోసంతృప్తి అనేది చాలా ముఖ్యం. డబ్బుకు ప్రాధాన్యంఇస్తూ పోతే జీవితం అశాంతిగా మారుతుంది.భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుఅత్యుత్తమమైన పరధర్మంకంటే అతి నీచమైనదైనా స్వధర్మంగొప్పది. ఇతరులలాగా ఉండలేకపోయామేఅనుకోవ డం మానుకుంటే మనిషితృప్తిగా జీవించగలడు.

  ఆంజనేయులు

  Archives

  హోంపేజి
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X