»   » నా ప్రియుడి గురించి నీచంగా మాట్లాడుతారా?.. తలదించుకోవాల్సి వస్తున్నది.. ఇలియానా

నా ప్రియుడి గురించి నీచంగా మాట్లాడుతారా?.. తలదించుకోవాల్సి వస్తున్నది.. ఇలియానా

Written By:
Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియాలో తన బాయ్‌ఫ్రెండ్ అండ్రూ నీబోన్‌పై నీచమైన వ్యాఖ్యలు చేయడంపై బాలీవుడ్ తార ఇలియానా డిక్రజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నా వ్యక్తిగత జీవితాన్ని నాకు ఇష్టం వచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తాను. మీరుందుకు దానిని పర్సనల్‌గా తీసుకొంటారని ఆమె మనస్తాపం చెందారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయవద్దు అని నెటిజన్లనకు ఆమె సలహా ఇచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలు ముబార్కన్, బాద్షాహో చిత్రాల్లో నటిస్తున్నది. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రొఫెషనల్, వ్యక్తిగత జీవితం గురించి ఇలియానా మాట్లాడుతూ..

నేను చాలా నిజాయితీగా ఉంటాను

నేను చాలా నిజాయితీగా ఉంటాను

నేను చాలా నిజాయితీగా ఉంటాను. ఈ మధ్యకాలంలో ప్రముఖ బ్యానర్‌లో పలు చిత్రాలను నిరాకరించాను. ఎందుకంటే అందులో నటనకు స్కోప్‌ లేనటువంటి పాత్రలు ఉన్నాయి. అందుకే వాటిని తిరస్కరించాను. 11 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్ తర్వాత కూడా ఏ పాత్ర పడితే ఆ పాత్రను చేయాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. నేను తీసుకొన్న నిర్ణయాలన్నీ సరైనవనే నిరూపించాయి అని అన్నారు.

గుర్తుపెట్టుకోవాలని అనుకోను..

గుర్తుపెట్టుకోవాలని అనుకోను..

గ్లామర్ ఫీల్డులో నన్ను 365 రోజులు ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలని అనుకోను. నేను చేసిన పాత్రలతోనే వారు నన్ను గుర్తుంచుకొంటారు. అని అన్నారు. ప్రస్తుతం బాద్షాహోలో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీ, ముబార్కాన్ చిత్రంలో అనిల్ కపూర్, అర్జున్ కపూర్‌తో నటిస్తున్నది.

Ileana's hot Secrets When She is Alone
అంత చులకనగా మాట్లాడుతారా?

అంత చులకనగా మాట్లాడుతారా?

వ్యక్తిగత జీవితానికి వస్తే అందరిలాగా నేను సొంత విషయాలను దాచుకోను. నా ప్రేమ వ్యవహారాన్ని నిజాయితీగా చెప్తే దానిపై చులకనగా మాట్లాడుతారా? నేను నా బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలను వెబ్‌సైట్లో నింపేస్తారా? మా ఫొటోల కింద నీచమైన, అభ్యంతకరమైన కామెంట్లు పెడుతారా?. నేను సెలబ్రిటీని. నా వ్యక్తిగత జీవితానికి, ప్రతిష్ఠకు భంగం కలిగించవద్దు అని ఇలియానా అన్నారు.

అఫైర్ బయటపెట్టొద్దని చెప్పారు..

అఫైర్ బయటపెట్టొద్దని చెప్పారు..

నా బాయ్‌ఫ్రెండ్ అండ్రూ తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టవద్దని చెప్పాడు. అయినా నేను దానిని పట్టించుకోకుండా నా అఫైర్‌ను బహిరంగ పరిచాను. ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులను చూస్తే ఆయన చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తున్నాను. ఆండ్రూ గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ నీచంగా మాట్లాడటం భాదేసింది అని ఇలియానా ఆవేదన వ్యక్తం చేసింది.

కమిట్‌మెంట్ ఉండాలి..

కమిట్‌మెంట్ ఉండాలి..

అఫైర్ గానీ, లివింగ్ రిలేషన్‌షిప్ గానీ, పెళ్లి గానీ ఇద్దరికి కమిట్‌మెంట్ ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య సంబంధాలు బలంగా ఉంటాయి. గత ఐదేళ్లలో మానసికంగా చాలా ధృడంగా మారాను. అందుకే జీవితం మీద చాలా అవగాహన ఏర్పడింది అని ఇలియానా చెప్పింది.

English summary
Ileana D’cruz says that though she hasn’t kept her love life hidden, it’s unfortunate that her boyfriend, Australian photographer, Andrew Kneebone has to be subjected to trolls. After Rustom in 2016, Ileana D’cruz has two releases - Mubarkaan and Baadshaho, this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu