For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రేమించే వయసులోనే ఉన్నా కాబట్టే...: ఇలియానా

  By Srikanya
  |

  ముంబై : ''నేనిప్పుడు ప్రేమించే వయసులోనే ఉన్నాను. అందుకే అలాంటి పాత్రలు వస్తున్నాయి. వయసుకి తగ్గ పాత్రలే చేయాలి. మరో పదేళ్లు గడిచాక ప్రేమ కథల్లో కనిపించాలన్నా కుదరదు. ఎక్కువగా ప్రేమకథలే చేస్తున్నారేంటి? అని చాలామంది అడుగుతుంటారు. ఎక్కువగా కాదు.. నేను చేసేవన్నీ అవే '' అంది. 'బర్ఫీ'తో బాలీవుడ్‌లోనూ విజయాన్ని సొంతం చేసుకొంది. ఆ సినిమా ఆస్కార్‌ కోసం మన దేశం తరఫున బరిలోకి దిగుతుంది. ''బర్ఫీ మనసుతో చూడాల్సిన సినిమా. అందుకే ఆ స్థాయికి వెళ్లింది'' అని పొంగిపోతోంది.

  సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఇలియానా...బర్ఫీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ హీరోగా ప్రియాంక చోప్రా, ఇలియానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 14న విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈచిత్రం ఒక చెవిటి, మూగ వ్యక్తి కథ. రణబీర్ ఆ పాత్రలో అద్భుతంగా నటించాడు. రణబీర్ తన నటనతో తాత రాజ్ కపూర్ పేరు నిలబెట్టాడనే ప్రశసంసలు అందుకుంటున్నాడు. జిల్మిల్ పాత్రలో ప్రియాంక చోప్రా నటకు మంచి మార్కులు పడ్డాయి. సౌత్ లో ఇప్పటికే తన టాలెంట్ నిరూపించుకున్న ఇలియానా ఈ చిత్రంలో శృతి పాత్రలో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

  ఇక ఇలియానా సినీ కెరీర్ విషయానికొస్తే...ఇటీవల ఆమె అల్లు అర్జున్‌తో కలిసి నటించిన 'జులాయి' చిత్రం హిట్ అయింది. దానికంటే ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజతో కలిసి ఇలియానా నటించిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం ఇలియానా ఇక షాహిద్ కపూర్ హీరోగా రాజ్‌‍కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందనున్న 'Phata Poster Nikla Hero' చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా సెలక్టయింది. వన్స్ అపానే టైమ్ ముంబై-2 చిత్రంలోనూ ఇలియానా సెలక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  ఇక ''ఫలానా పాత్ర వస్తే బాగుండును... అని ఎప్పుడూ కోరుకోలేదు. కలగంటూ కూర్చొంటే లక్ష్యాలు నెరవేరవు. నేను ఏ పాత్రలకు బాగుంటానో... నాకంటే దర్శకులకే బాగా తెలుసు'' అంటోంది ఇలియానా. ఇలియానా. అంతేగాక ''స్ఫూర్తి వేరు, అనుకరణ వేరు. నాకు స్ఫూర్తి కావాలి. ఎవరినో చూసి 'ఆలానే చేయాలి..' అనుకొంటే అందరూ నన్ను కాపీ నటిగానే చూస్తారు. ప్రతి పాత్ర నా పంథాలోనే పండిస్తాను. త్వరలోనే నా కొత్త హిందీ చిత్రాల వివరాలు వెల్లడిస్తాను'' అని చెప్పిందీ గోవా భామ.

  English summary
  Ileana D'Cruz happy with her latest hits Burphi and Julai. She has managed to top the remuneration chart. The Goa beauty has overtaken Southern actresses like Trisha Krishnan and Anushka Shetty to become the highest paid lass of the regional film industry. Here we bring you the remuneration list of top five highly paid actresses.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X