»   » 18 ఏటనే ఆ అనుభవం...ఇంటర్వ్యూలో లీక్ చేసిన ఇలియానా!

18 ఏటనే ఆ అనుభవం...ఇంటర్వ్యూలో లీక్ చేసిన ఇలియానా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకెలుతోంది. ఆమె నటించిన తొలి బాలీవుడ్ చిత్రం 'బర్ఫీ' మంచి విజయం సాధించడంతో పాటు ఇటీవల విడుదలైన 'మే తేరా హీరో' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద హిట్టయింది.

ప్రస్తుతం 'హ్యాపీ ఎండింగ్' అనే మరో చిత్రంలో నటిస్తున్న ఇలియానా....ఓ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు ఇలియానా స్పందిస్తూ....తనకు 18వ ఏటనే తొలి ముద్దు అనుభవం ఎదురైందని తెలిపారు. ఎవరి ద్వారా ఆ అనుభవం ఎదురైంది? అనే విషయం మాత్రం ఇలియానా బయట పెట్ట లేదు.

 Ileana's First Kiss Experience At The Age Of 18!

అదే విధంగా....సెక్సీనెస్‌ విషయంలో 10 పాయింట్లకు‌గాను మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? అనే ప్రశ్నకు ఇలియానా స్పందిస్తూ 5 మార్కలు వేసుకుంటానని సమాధానం ఇచ్చింది. ఇప్పటి వరకు తాను ఎవరితోనూ ప్రేమలో పడ లేదని, ప్రస్తుతం తనకు కెరీరే ముఖ్యమని ఇలియానా వెల్లడించారు.

మగాళ్లలో ముందుగా పరిగణలోకి తీసుకునే రెండు అంశాల్లో నిజాయితీ, తెలివితేటలకు ప్రాధాన్యత ఇస్తానని, అపరిశుభ్రంగా ఉండే మగాళ్లు అంటే నాకు అస్సలు నచ్చదని ఇలియానా చెప్పుకొచ్చారు. నాకు సంబంధించిన వరకు బాలీవుడ్లో ఇప్పుడున్న వారిలో సెక్సీయెస్ట్ పర్సన్ అమితాబ్ బచ్చన్ అని ఇలియానా చెప్పుకొచ్చింది.

English summary
For a question asked by the interviewer When was your first lip kiss? Ileana promptly replies by saying at the age of 18.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu