»   » నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: అభిమానిపై ఇలియానా కోపం

నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: అభిమానిపై ఇలియానా కోపం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇలియానా... ఒక‌ప్పుడు కుర్ర‌కారును ఊపేసిన పేరిది. దేవ‌దాసుతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి అన‌తికాలంలోనే స్టార్‌డ‌మ్ సంపాదించింది ఈ గోవా బేబీ. అయితే కాలంక‌లిసిరాక ప్ర‌స్తుతం తెలుగులో ఆఫర్లు అడుగంటాయి. దీంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఇలియానా అడ‌పాద‌డ‌పా సినిమాలు చేసినా పెద్ద‌గా క్రేజ్ రాలేదు.

మై తేరా హీరో

మై తేరా హీరో

టాలీవుడ్‌లో అగ్ర నాయికగా ఎదిగిన కొద్ది కాలానికే బాలీవుడ్‌లో కెరీర్‌ను వెతుక్కుంటూ వెళ్లిన ఈ గోవా బ్యూటీకి 'బర్ఫీ' రూపంలో మంచి ఆరంభం దక్కింది కానీ, ఆ తర్వాత ఆశించిన రీతిలో విజయాలు లభించలేదు. 'ఫటా పోస్టర్‌ నిక్లా హీరో' యావరేజ్‌గా ఆడగా, 'కందిరీగ' రీమేక్‌ 'మై తేరా హీరో' సైతం అదే స్థాయిలో ఆడింది.

Ileana Hot Secrets when she is alone
హ్యాపీ ఎండింగ్‌

హ్యాపీ ఎండింగ్‌

సైఫ్‌ అలీఖాన్, గోవిందా కాంబినేషన్‌లో చేసిన 'హ్యాపీ ఎండింగ్‌' అయితే బాగా నిరాశపరిచింది. ఆ సినిమా వచ్చి సుమారు రెండేళ్లవుతోంది. 2015లో ఆమె సినిమా ఒక్కటి కూడా రాలేదు. తర్వాత అక్షయ్‌కుమార్‌తో 'రుస్తుం' చేసింది. ఆ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్లలో ఒకటి అయినా అక్షయ్ కి పేరు వచ్చింది తప్ప ఇలియానా కు పెద్దగా ఒరిగిందేమీ లేదు...

బాలీవుడ్ అవకాశాల కోసం

బాలీవుడ్ అవకాశాల కోసం

టాలీవుడ్‌లో అగ్రతార వెలుగొందిన ఆమె ప్రస్తుతం వేషాలు లేక తెలుగు పరిశ్రమకు దూరమైంది. టాలీవుడ్‌కు దూరమైన ఇలియానా బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నది. గత కొద్దికాలంగా హాట్ హాట్‌గా ఫొటో షూట్‌లకే పరిమితమైంది.ఒకప్పుడు వరుస తెలుగు సినిమాలతో అలరించిన ఇలియానా ఇప్పుడు బాలీవుడ్‌కు పరిమితమయింది.

అసభ్యంగా వ్యవహరించాడు

అసభ్యంగా వ్యవహరించాడు

తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ఇటువైపు చూడటం మానేసిన ఈ అమ్మడు వరుసగా హిందీలో అవకాశాలను అందుకుంటోంది. అయితే, ఇటీవల ఓ పురుష అభిమాని ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడట. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించిన ఇలియానా.. అతని వికృత స్వభావంపై తీవ్రంగా మండిపడింది.

నేనొక పబ్లిక్‌ ఫిగర్‌ని

'మనం నివసిస్తున్నది చాలా సంకుచితమైన, అల్పమైన ప్రపంచం. నేనొక పబ్లిక్‌ ఫిగర్‌ని. బహిరంగ ప్రదేశాల్లో నాకు పెద్దగా వ్యక్తిగత జీవితం ఉండదని తెలుసు. కానీ, అంతమాత్రాన నాతో అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయంలో అభిమాన వికారాలను నాపై చూపకండి.

ఘాటుగా ట్వీట్‌

నేనూ ఒక మహిళనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి' అంటూ ఇలియానా ఘాటుగా ట్వీట్‌ చేసింది.ప్రస్తుతం ఇలియానా నటించిన 'బాద్‌షాహో' హిందీ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది. అజయ్‌ దేవగణ్‌, ఇమ్రాన్‌ హష్మీ, ఈషా గుప్తా ప్రధాన పాత్రల్లో మిలాన్‌ లుథ్రియా రూపొందించిన ఈ సినిమాపై ఇలియానా భారీ ఆశలే పెట్టుకుంది.

English summary
Ileana D'Cruz experienced the flip side of being in showbiz recently. A male fan misbehaved with the actor, and she took to Twitter to lash out at him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu