»   » నేను ఇంత వరకూ అంతలా ఎప్పుడూ ఏడవలేదు: ఇలియానా

నేను ఇంత వరకూ అంతలా ఎప్పుడూ ఏడవలేదు: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను ఇంత వరకూ అంతలా ఎప్పుడూ ఏడవలేదు. కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆ స్థాయిలో ఉంటాయి. ఇంటికెళ్లాకా కూడా ఏడుపొచ్చేసేది. నన్ను చూసి అమ్మ ఏడ్చేసేది అంటూ ఇలియానా తన తాజా చిత్రం 'నేను నా రాక్షసి' గురించి చెప్పుకొచ్చింది.అలాగే ఈ చిత్రంలో తనను రాక్షసి అని పిలవటం గురించి చెబుతూ..పూరి జగన్నాథ్‌ ఏది చేసినా దానికో అర్థం ఉంటుంది. నన్ను రాక్షసి అని పిలిచినా అది కథ అవసర్థామే. 'నేను నా రాక్షసి' చిత్రంలో నన్ను చూసిన ఎవరికైనా అలాగే పిలవాలనిపిస్తుంది అంది.ఇక నేను ఈ చిత్రంలో అసాధారణంగా ప్రవర్తించే ఓ సాధారణ యువతి పాత్ర నాది. రాక్షసి అంటే తిట్టనే ఎందుకు అనుకోవాలి. ప్రేమతో కూడా పిలవచ్చు కదా అంది.ఇక శక్తి ఫ్లాప్ గురించి మాట్లాడుతూ..హిట్టు ప్లాపు అనేది మనం నిర్ణయించలేం. అదంతా దర్శకుడి చేతుల్లో ఉంటుంది. నా వరకూ నాకు మంచి పేరే వస్తోంది అని తేల్చేసింది.అలాగే ఈ చిత్రంలో ఇలియానా ద్విపాత్రాభినయం చేస్తోంది.

English summary
Ileana will be the first generation actress to essay a dual role in her her upcoming film Nenu Naa Rakshasi.It is reliable learnt that she would be portraying two roles as different as chalk and cheese and has showcased her versatility.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu