»   » నాకు బాగా నచ్చిన ఉచిత సలహా అదే...ఇలియానా

నాకు బాగా నచ్చిన ఉచిత సలహా అదే...ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తే నాకు నచ్చదు. నేను కూడా ఎవరికీ సలహాలు ఇవ్వను అంటూ తన ఫిలాసఫీని చెప్పింది ఇలియానా. అలా ఆలోచించే ఆమెను సైతం ఓ ఉచిత సలహా ఆలోచనలోపడేసిందిట. ఈ విషయం గురించి చెబుతూ.. ఆ మధ్య ఓ వ్యక్తి ఎవరి నుంచి ఏమీ ఆశించకు అని సలహా ఇచ్చాడు. నాకెందుకో ఆ సలహా బాగా నచ్చింది. ఇప్పటివరకు నేను అందుకున్న సలహాల్లో ఇదే బెస్ట్ అని నా ఫీలింగ్ అన్నారు. ఇక ఇలియానా నటించిన శక్తి చిత్రం ఆడియో రీసెంట్ గా విడుదలైంది. ఈ నెల 30వ తేదీన చిత్రం విడుదల కానుంది. అలాగే ఆమె నటించిన నేనూ...నా రాక్షసి చిత్రం కూడా త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు ఆమె శంకర్ దర్శకత్వంలో త్రీ ఇడియట్స్ తెలుగు,తమిళ వెర్షన్స్ లో నటిస్తోంది. అలాగే పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా, మహేష్‌బాబుతో మరో సినిమా, ప్రభాస్‌తో ఓ సినిమా కమిటైంది. రెమ్యునేషన్ కూడా పెంచిన ఈ భామ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. త్వరలో బాలీవుడ్ లో కూడా ప్రవేశించి హిట్స్ కొడతానని నమ్మకంగా చెప్తోంది.

English summary
Ileanas fresh looks in 'Kick' movie, has made her busy in the Telugu filmdom. She has got four films in her kitty and many directors and producers are lined up outside her house to sign her up in new movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu