twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్-10 ఇండియన్ మూవీస్-2017: స్క్రీన్‌కు కట్టిపడేశాయంతే..

    |

    2017 సంవత్సరం చరమాంకానికి రావడంతో.. ఈ ఏడాది విడుదలైన సినిమాలు.. సాధించిన విజయాలు.. మొత్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గ్రాఫ్‌పై చర్చ జరుగుతోంది.

    Recommended Video

    టాలీవుడ్ బెస్ట్ అఫ్ 2017

    ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా అటు ప్రయోగాత్మాక చిత్రాలు.. ఇటు కమర్షియల్ చిత్రాలు వెండితెరను బ్యాలెన్స్ చేశాయి. వాటిల్లో కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టగా.. మరికొన్ని మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

    అలా విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో తమ సంస్థ తరుపున టాప్-10లిస్టును విడుదల చేసింది ఐఏండీబీ వెబ్‌సైట్(ఇంటర్నెట్ మూవీ డేటా బేస్).

     #10-గ్రేట్ ఫాదర్:

    #10-గ్రేట్ ఫాదర్:

    ఇదో తండ్రి-కూతుళ్ల కథ. పదేళ్ల వయసున్న తన కూతురిపై గ్యాంగ్ రేప్ చేసిన వ్యక్తుల మీద తండ్రి ప్రతీకారం తీర్చుకునే కథ. తండ్రి పాత్రలో మమ్ముట్టి నటన అభిమానులను విపరీతంగా అలరించింది. ఆయన భార్య పాత్రలో స్నేహా తనదైన నటనతో మెప్పించారు.

    అప్పటిదాకా సంతోషంగా గడిపిన తన కూతురి ముఖంలో గ్యాంగ్ రేప్ కారణంగా నవ్వు మాయమైపోవడం ఆ తండ్రి తట్టుకోలేకపోతాడు. వాళ్లనెలాగైనా శిక్షించాలనే ప్రయత్నంలో.. చివరకు విజయం సాధిస్తాడు. మలయాళ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు రూ.30కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

    టాలీవుడ్ 2017 రిపోర్ట్: కలెక్షన్ల పరంగా టాప్ 10 సినిమా ఇవే...టాలీవుడ్ 2017 రిపోర్ట్: కలెక్షన్ల పరంగా టాప్ 10 సినిమా ఇవే...

     #9-మెర్సల్:

    #9-మెర్సల్:

    ఐఏండీబీ ర్యాంకింగ్స్ లో తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం తొమ్మిదో స్థానంలో నిలిచింది. వైద్య రంగం చుట్టూ తిరిగే ఈ కథ పలు వివాదాలకూ కేంద్ర బిందువుగా నిలిచింది.

    సినిమాలో జీఎస్టీ గురించి సంధించిన విమర్శనాస్త్రాలు రాజకీయంగాను చర్చను లేవనెత్తాయి. మొత్తంగా వైద్య సేవ ముసుగులో పక్కా బిజినెస్‌మెన్‌గా మారిన ఓ వ్యక్తి కథ ఇది. విజయ్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఆయన సరసన కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు.

     #8 - జాలీ ఎల్ఎల్బీ-2:

    #8 - జాలీ ఎల్ఎల్బీ-2:

    ఐఎండీబీ ర్యాంకింగ్స్‌లో ఎల్ఎల్బీ-2 ఎనిమిదో స్థానంలో నిలిచింది. జాలీ భారతీయ న్యాయ వ్యవస్థలోని లోటుపాట్లను చర్చిస్తూ సందేశాత్మకంగా రూపొందించిన హిందీ చిత్రం జాలీ ఎల్‌ఎల్‌బి-2.

    బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో.. అక్షయ్‌ కుమార్ ప్రధాన పాత్రను పోషించగా, సుభాష్‌కపూర్ దర్శకత్వం వహించారు. ఓ కేసును గెలిచే క్రమంలో న్యాయవాది ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఆద్యంతం వ్యంగ్యభరితంగా సందేశాన్ని మేళవించి తెరకెక్కించారు.

    #7-టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా:

    #7-టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా:

    ఐఎండీబీ ర్యాంకింగ్స్‌లో టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా ఏడో స్థానం దక్కించుకుంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఇటీవల ఈ సినిమాపై ట్వీట్ చేయడం విశేషం. 2017లో ప్రపంచ యవనికపై ప్రభావం చూపించిన సినిమాల్లో ఒకటిగా దీన్ని పేర్కొన్నారు.

    భారత్‌లో సవాల్‌గా నిలిచిన బహిరంగ మలవిసర్జన సమస్యపై ఈ సినిమాలో అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. శ్రీ నారాయణ్ సింగ్ డైరెక్షన్‌లో అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.106.08కోట్ల వరకు రాబట్టింది.

     #6-ఘాజీ:

    #6-ఘాజీ:

    ఐఎండీబీ ర్యాంకింగ్స్ లో ఈ సినిమా ఆరో స్థానాన్ని దక్కించుకుంది. 1971లో భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్దంలో ఓ సబ్ మెరైన్ నీట మునిగిపోయింది. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం 'ఘాజీ'. రానా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో, భారీ గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. భారత దేశపు మొదట్టమొదటి సబ్ మెరైన్ కాన్సెప్ట్ మూవీగా ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయింది.

    #5-హిందీ మీడియం:

    #5-హిందీ మీడియం:

    ఐఎండీబీ ర్యాంకింగ్స్ లో ఈ సినిమా ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఇర్ఫాన్ ఖాన్, సబా కమార్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తమ బిడ్డను ఢిల్లీలోని ఓ టాప్ స్కూల్లో అడ్మిట్ చేయడం కోసం ఇర్ఫాన్-సబా పడ్డ ఎదుర్కొనే ఇబ్బందులే ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది. ఉన్నత స్థాయిలో ఉండే ఇర్ఫాన్ కుటుంబం కూతురి చదువు కోసం మధ్యతరగతి కుటుంబంగా మారిపోవడం సినిమాలో హైలైట్.

     #4-సీక్రెట్ సూపర్ స్టార్:

    #4-సీక్రెట్ సూపర్ స్టార్:

    ఐఎండీబీ ర్యాంకింగ్స్ లో ఈ సినిమా నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. సింగర్ గా ప్రపంచానికి తన గొంతును పరిచయం చేయాలనుకునే ఇన్సియా మాలిక్ (జైరా వసీం) కథ ఇది. ఆమె తండ్రి ఫరూక్ మాలిక్ (రాజ్ అర్జున్)కు మాత్రం కూతురి కోరిక ఇష్టముండదు. ఆయన నుంచి ఎదురయ్యే అడ్డంకుల్ని దాటుకుని ఇన్సియా సూపర్ స్టార్ గా ఎదగడమే ఈ సినిమా నేపథ్యం.

     #3-అర్జున్ రెడ్డి:

    #3-అర్జున్ రెడ్డి:

    తెలుగు తెర మీద అర్జున్ రెడ్డి చేసిన థ్రిల్ అంతా ఇంతా కాదు. విజయ్ నటన, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. 2017లో టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసిన చిత్రంగా అర్జున్ రెడ్డి నిలిచింది. మెడికల్ బ్యాక్ డ్రాప్‌లో సాగిన సరికొత్త కథనం, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా విజయ్ నటన, విజయ్ స్నేహితుడిగా రాహుల్ రామకృష్ణ పెర్ఫామెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

    #2-బాహుబలి:

    #2-బాహుబలి:

    2017లో విడుదలైన బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. పలు రికార్డులనూ తిరగరాసింది. ఈ సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా ఉందన్న ప్రశంసలనూ అందుకుంది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టిన ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయి అనేవాళ్లు లేకపోలేదు.

     #1-విక్రమ్ వేదా:

    #1-విక్రమ్ వేదా:

    ఐఎండీబీ ర్యాంకింగ్స్‌లో తమిళ చిత్రం విక్రం వేదాకు తొలి స్థానం దక్కడం విశేషం. విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా నటించిన ఈ సినిమా తమిళలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

    ఒక గ్యాంగ్ స్టర్‌కి, ఒక పోలీస్ ఆఫీసర్‌కి మధ్య జరిగే వార్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. దర్శకులు పుష్కర్, గాయత్రి స్క్రీన్ ప్లేకు ఇచ్చిన ట్రీట్మెంట్‌పై పలు ప్రశంసలు కూడా వచ్చాయి.

    English summary
    The movies on this list are ranked based on the popular IMDb Top Rated Charts criteria.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X