»   » రజినీకాంత్ తప్ప ఇంకేం లేదా?: సూపర్ స్టార్ మీద విరుచుకుపడింది

రజినీకాంత్ తప్ప ఇంకేం లేదా?: సూపర్ స్టార్ మీద విరుచుకుపడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఏదో ఒక సమస్యని పట్టుకునే ఉంటాయి. కొన్నాళ్ళ పాటు అది తప్ప ఇంకో సమస్యే లేనట్టు పతాక శీర్షికలన్నీ ఒకే విషయాన్ని ఊదరగొడుతూంటాయి. అమ్మ మరణం తర్వాత తమిళ రాజకీయాల రూపురేఖలే మారి పోయాయి. ముఖ్య మంత్రులు మారటం, ఊహించని విధంగా శశికళ జైలు పాలు కావటం ఇలా పెను మార్పులు వచ్చాయి.. అయినా సరే ఇప్పుడు తమిళ మీడియా దృష్టి మాత్రం కేవలం రజినీ కాంత్ రాజకీయ ప్రవేశం చుట్టూనే ఉంది. ఇదే తరహా వార్తలను చూసి బోరుకొడుతోంది.. ఇంక వేరే విషయాలే లేవా? అంటూ తమిళ నటి కస్తూరీ చురకలు వేసింది.

ర‌జ‌నీ త‌ప్ప స‌మ‌స్య‌లేవీ క‌నిపించడం లేదా?

ర‌జ‌నీ త‌ప్ప స‌మ‌స్య‌లేవీ క‌నిపించడం లేదా?

"ర‌జ‌నీ త‌ప్ప మీకు మిగ‌తా విష‌యాలు ప‌ట్ట‌వా? ఆయ‌న రాజ‌కీయాగమ‌నం గురించి మాత్ర‌మే ఎందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు? త‌మిళ ప్ర‌జ‌లు, రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లేవీ క‌నిపించడం లేదా?" అంటూ తమిళ, జాతీయ‌ మీడియాలపై ప్ర‌ముఖ తమిళ సినీ న‌టి క‌స్తూరి చిరాకు పడింది..

అయితే

అయితే

కస్తూరి ఇలా రజినీ విషయం లో జోక్యం చేసుకోవటం మొదటిసారి కాదు.. గత నెలలో కూడా 'రజనీ.. యుద్ధం (పోర్) అంటున్న మీ మాటలు విని బోర్ కొడుతోంది స్వామి. రాజకీయ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేయకుండా పోరు వచ్చినప్పుడు చూసుకుందామని రజనీకాంత్ చేస్తున్న ప్రకటనలు బోర్ కొడుతున్నాయి. అనిశ్చితి పరిస్థితిలోను స్థిరమైన నిర్ణయాన్ని తక్షణం తీసుకునే వాడే నిజమైన రాజకీయ నాయకుడు. రజనీ కూడా ఏదో ఒక స్థిరమైన నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలి' అని కస్తూరి ట్వీట్ చేసింది.

నోరు మూసుకో

నోరు మూసుకో

దీనిపై రజనీకాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై విరుచుకు పడ్డారు. 'నువ్వు కూడా రజనీకాంత్ గురించి మాట్లాడుతున్నావా.. అంతా టైమ్.. ఏం చేస్తాం.. నోరు మూసుకొని పోవే' అని ఓ అభిమాని దురుసు స్పందనకు. అంతే స్పీడ్ గా అంతే వాడిగా సమాధానం చెప్పింది.. మిస్టర్..! నువ్వు పుట్టక ముందు నుంచి నేను రజనీకాంత్ అభిమానిని అని, నీలాంటి మర్యాదలేని అభిమానుల వల్ల ఆయనకు చెడ్డపేరు, అవమానం.. ముందు నీ నోరు మూసుకో అని హితవు పలికింది.

మళ్ళీ రజినిని ప్రస్తావనకు తెస్తూ

మళ్ళీ రజినిని ప్రస్తావనకు తెస్తూ

ఇప్పుడు మళ్ళీ రజినిని ప్రస్తావనకు తెస్తూ ఇంకోసారి వార్తల్లోకి ఎక్కింది. గత డిసెంబర్‌లో అమ్మ చ‌నిపోయాక‌ రాష్ట్రంలో శూన్యత ఆవరించి ఉంది. ఓ మంచి వ్యక్తి ఆ శూన్యాన్ని భర్తీ చేయాల్సిన అవ‌స‌ర‌ముంది. అయితే, ర‌జ‌నీ రాజకీయాల్లోకి వస్తారా? రారా? అంటూ ఊద‌ర‌గొట్టేయ‌డం స‌బ‌బు కాద‌ని ఆమె అభిప్ర‌యాప‌డింది.

మార్పు దిశగా రజనీ

మార్పు దిశగా రజనీ

కస్తూరి ఇటీవల రజనీకాంత్‌ను కలిసినపుడు ఆయన రాజకీయ అభిప్రాయాలు తెలుసుకున్నాన‌ని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే మార్పు దిశగా రజనీ అడుగులు వేసే అవకాశముందని ఆమె చెప్పారు. అభిమానుల‌తో ఫొటో సెష‌న్ సంద‌ర్భంగా దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వ‌స్తాన‌ని ర‌జ‌నీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
Actress Kasturi has stated that the national media is only focusing on the actor Rajinikanth when Tamil Nadu has so many more present problems that need to be discussed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu