»   » ఒక్కరు కాదు.. ఇద్దరు అందాల భామలతో రానా.. ట్విట్టర్‌లో ట్రెండింగ్..

ఒక్కరు కాదు.. ఇద్దరు అందాల భామలతో రానా.. ట్విట్టర్‌లో ట్రెండింగ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి. బాహుబలి చిత్రంలో భల్లాళదేవ పాత్ర ద్వారా జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకొన్న రానా తాజాగా మాక్సీమ్ పత్రిక కవర్ పేజ్‌పై తళుక్కున మెరిశాడు. ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య స్టైల్‌గా కూర్చొని ఉన్న రానా పోస్టర్ దేశవ్యాప్తంగా మహిళా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్నది.

మాక్సిమ్ మ్యాగజైన్‌పై

మాక్సిమ్ మ్యాగజైన్‌పై

అత్యంత ప్రజాదరణ ఉన్న మాక్సీమ్ మ్యాగజైన్ తాజాగా ఏప్రిల్ ఎడిషన్ ప్రత్యేక సంచికగా వెలువరించింది. ఆ పత్రిక కవర్ పేజీపై రాజసం ఉట్టిపడుతున్నట్టు ఇద్దరు అందాల భామల మధ్య కూర్చొని రానా దగ్గుబాటి ఫొటోను ప్రముఖంగా ప్రచురించింది.

మాక్సిమ్ కవర్ పేజీ..

మాక్సిమ్ కవర్ పేజీ..

తాజా సంచిక కవర్ పేజీని మాక్సీమ్ ట్వీట్టర్‌లోని తన ఖాతాలో షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. గ్రే కలర్ సూట్‌లో ఉన్న రానా లుక్‌కు, స్టైయిల్‌పై మంచి కామెంట్లు రావడం గమనార్హం.

సుచీలీక్స్‌లో రానా

సుచీలీక్స్‌లో రానా

ఇటీవల సుచీలీక్స్‌లో రానా, త్రిష ఫొటో ఇంటర్నెట్‌ల వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరు భామల మధ్య రొమాంటిక్ రానా కనిపించడం కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ఒక్కరు కాకుండా ఇద్దరు భామల మధ్య తాపీగా లుక్కివ్వడంతో మరోసారి జాతీయస్థాయిలో రానాకు గుర్తింపువచ్చింది.

28న బాహుబలి2 రిలీజ్

28న బాహుబలి2 రిలీజ్

రానా నటించిన బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్నది. బాహుబలి మొదటి భాగంలో భళ్లాలదేవ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్‌లో రాజమౌళి, ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణలు పాల్గొంటున్నారు.

English summary
Maxim, one of the most popular men’s magazine, unveiled their special April edition, with Baahubali’s Rana Daggubati, gracing the cover. Baahubali star can be seen sitting on a chair, wearing a slick grey suit with minimal accessories. He is accompanied by two ladies in the snap.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu