»   » ఇంద్రగంటి మోహన కృష్ణ మరోసారి మల్టీస్టారర్.... అడివి శేష్, అవసరాల తో

ఇంద్రగంటి మోహన కృష్ణ మరోసారి మల్టీస్టారర్.... అడివి శేష్, అవసరాల తో

Posted By:
Subscribe to Filmibeat Telugu

అడివి శేష్‌, అవసరాల శ్రీనివాస్‌ కథానాయకులుగా ఓ సినిమా రూపొందబోతోంది. ఈమధ్యే 'జెంటిల్‌మన్' సినిమాతో విజయాన్ని అందుకొన్న మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.'జెంటిల్ మెన్' మూవీ సూపర్‌ హిట్‌తో మరో డిఫరెంట్ జోనర్‌లో సరికొత్త చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు మోహనకృష్ణ ఇంద్రగంటి...

ఈ సారి మల్టీస్టారర్‌ సినిమాకు ప్లాన్‌ చేస్తున్నారు. స్క్రూ బాల్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అడివి శేష్‌-అవసరాల శ్రీనివాస్‌ హీరోలుగా నటిస్తుండగా... ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.సి.నరసింహారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స పతాకంపై కె.సి. నరసింహారావు నిర్మించనున్నారు.

ఆయన మాట్లాడుతూ 'స్క్రూ బాల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఓ భిన్నమైన తరహాలో ఈ చిత్రాన్ని మోహనకృష్ణ తీర్చిదిద్దనున్నారు. ఆద్యంతం హాస్యంతో అలరిస్తుంది. శేష్‌, శ్రీనివాస్‌ పాత్రలు ఎంతగా ఆకట్టుకుంటాయో, ఓ ముఖ్యపాత్ర పోషించే వెన్నెల కిశోర్‌ పాత్ర కూడా అంతే ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 1 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుతాం'' అని చెప్పారు.

Indraganti Mohana Krishna Multi Starrer With Avasarala Srinivas and Adivi Sesh

మొదట్లో అవసరాల తో పాటుగా రెండో హీరో పాత్రకి వెన్నెల కిషోర్ అనుకున్నారట మళ్ళీ ఏమైందో గానీ అడివి శేష్ సీన్లోకి ఎంటర్ అయ్యాడు. వచ్చే నెలనుంచీ షూటింగ్ మొదలు పెట్ట బోయే ఈసినిమా కామెడీబేస్ గానే ఉన్నప్పటికీ థిల్లర్ గా కూడా కనిపించే లా ఉంటుందట కథ. వెన్నెల కిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించనున్న చిత్రంతో నిర్మాతగా మారుతుండడం సంతోషంగా ఉంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మా చిత్రానికి సంగీత సారధ్యం వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది" అన్నారు.

ఈ చిత్రానికి కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవిందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రాఫర్: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహా రావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

English summary
Indraganti Mohana Krishna is a neat, clean and entertaining filmmaker. He is all set to begin the next film shooting from February 1st and it’s a multi starrer. With Adivi Sesh, Avasarala Srinivas, Vennela Kishore and others
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu